పంగనామా జాబితాలో ఐశ్వర్యరాయ్

పనామా పత్రాలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి.  ప్రపంచవ్యాప్తంగా బడాబాబులు సొంతదేశంలో దోపిడి చేసి విదేశాల్లో దాచిన సొమ్ము వివరాలను పనామా పత్రాలు బహిర్గతం చేశాయి.  పనామా కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ మీడియా సంస్థల సమాఖ్య 370 మంది జర్నలిస్టులతో నిర్వహించిన పరిశోధనలో దేశాధీనేతల నుంచి యాక్టర్ల వరకు అక్రమ సొమ్ము గుట్టురట్టైంది.  పనామా ప్రకటించిన జాబితాలో 500 మంది భారతీయుల పేర్లు కూడా ఉన్నాయి. వారిలో  అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ పేర్లు ప్రముఖంగా ఉన్నాయి. దేశంలో పన్నులు ఎగవేసేందుకు వీరు విదేశాల్లో నిబంధనలకు విరుద్దంగా కంపెనీలు తెరిచిన సంగతిని పనామా పేపర్లు బయటపెట్టాయి.

అమితాబ్‌ బచ్చన్‌, ఐశ్యర్యరాయ్‌ తోపాటు, డీఎల్‌ఎఫ్ ప్రమోటర్‌ కేపీ సింగ్, ఇండియా బుల్స్ యజమాని సమీర్ గుప్తా, ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ పెద్ద సోదరుడు వినోద్ అదానీ, పశ్చిమ బెంగాల్ రాజకీయ నేత శిశిర్ బజోరా, ఢిల్లీ లోక్‌సత్తా చీఫ్‌ అనురాగ్ కేజ్రీవాల్ తదితరుల పేర్లు ఈ జాబితాలో ఉండటం కలకలం రేపుతోంది.

ఐశ్యర్య రాయ్‌, ఆమె తండ్రి రమణరాజ్‌ కృష్ణరాయ్‌, తల్లి విందాకృష్ణ రాజ్‌ రాయ్‌, సోదరుడు ఆదిత్య రాయ్‌ డైరెక్టర్లుగా 2005లో ఎమిక్ పార్టనర్స్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటైంది. మొదట ఈ కంపెనీకి ఐశ్యర్య డైరెక్టర్‌గా ఉండగా, తర్వాత షేర్‌ హోల్డర్‌గా మారిపోయారు. 2008లో ఈ కంపెనీ రద్దయింది. విదేశాల్లో కంపెనీల ఏర్పాటును ఆర్‌బీఐ అనుమతులు లేకుండా ఐశ్వర్య కంపెనీ తెరిచింది.

అమితాబచ్చన్‌  నాలుగు విదేశీ షిప్పింగ్ కంపెనీల్లో డైరెక్టర్‌గా ఉన్నట్టు పనామా పత్రాలు వెల్లడించాయి.  వీటిలో మూడు కంపెనీలు బహమస్‌లో ఉన్నాయి.  వీటి మూల ధనం కేవలం 5వేల నుంచి 50 వేల డాలర్లు మాత్రమే. అయితే వీటి వ్యాపారం మాత్రం వందల కోట్లలో సాగినట్టు పనామా పత్రాలు చెబుతున్నాయి.  వీరంతా దేశంలో పన్నులు ఎగొట్టేందుకే నల్లధనంతో విదేశాల్లో కంపెనీలు తెరిచినట్టు పనామా చెబుతోంది.

వేల కోట్ల స్వదేశీ సొమ్మును విదేశాల్లో దాచిన వారిలో రష్యా అధ్యక్షడు పుతిన్, పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్, చైనా ప్రధాని జింపింగ్ తదితరులు కూడా ఉన్నారు.  పుతిన్, ఆయన సన్నిహితులు ఏకంగా 2 బిలియన్ డాలర్లు (రూ. 13,269 కోట్లు) పోగేసినట్టు వెల్లడైంది.

Click on Image to Read:

nehru

dattu

jagan-raghuveera

saritha-nair

jyothula-nehrurayapti

revanth-jagan-k

99

gali-janardhan

5

kodali-nani