Telugu Global
International

పాక్ మీడియా...మ‌రీ ఇంత దారుణ‌మా!

పంజాబ్, ప‌ఠాన్‌కోట్ ఉగ్ర‌దాడి విష‌యంలో భార‌త్ ఒట్టి అబ‌ద్దాల కోరుగా వ్య‌వ‌హ‌రిస్తోందంటూ పాక్ ప‌త్రిక ఒక‌టి అత్యంత వివాదాస్ప‌ద‌ క‌థ‌నం ప్ర‌చురించింది.  ప‌ఠాన్‌కోట్ ఉగ్ర‌దాడి విష‌యంలో భార‌త్ చెప్పేవ‌న్నీ అవాస్త‌వాలేన‌ని, బ‌ల‌మైన సాక్ష్యాధారాలు లేకుండానే పాక్‌పై నింద‌లు వేస్తోంద‌ని పాకిస్తాన్ టు డె ప‌త్రిక పేర్కొంది. ఉగ్ర‌దాడి విష‌యంలో ద‌ర్యాప్తుకోసం భార‌త్‌కి వ‌చ్చివెళ్లిన సంయుక్త ద‌ర్యాప్తు బృందం స‌భ్యులు తెలిపిన‌ట్టుగా పేర్కొంటూ, ఆ ప‌త్రిక భార‌త్‌పై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేసింది. ఉగ్ర‌వాదుల దాడి తాలూకూ ముంద‌స్తు స‌మాచారం […]

పాక్ మీడియా...మ‌రీ ఇంత దారుణ‌మా!
X

పంజాబ్, ప‌ఠాన్‌కోట్ ఉగ్ర‌దాడి విష‌యంలో భార‌త్ ఒట్టి అబ‌ద్దాల కోరుగా వ్య‌వ‌హ‌రిస్తోందంటూ పాక్ ప‌త్రిక ఒక‌టి అత్యంత వివాదాస్ప‌ద‌ క‌థ‌నం ప్ర‌చురించింది. ప‌ఠాన్‌కోట్ ఉగ్ర‌దాడి విష‌యంలో భార‌త్ చెప్పేవ‌న్నీ అవాస్త‌వాలేన‌ని, బ‌ల‌మైన సాక్ష్యాధారాలు లేకుండానే పాక్‌పై నింద‌లు వేస్తోంద‌ని పాకిస్తాన్ టు డె ప‌త్రిక పేర్కొంది. ఉగ్ర‌దాడి విష‌యంలో ద‌ర్యాప్తుకోసం భార‌త్‌కి వ‌చ్చివెళ్లిన సంయుక్త ద‌ర్యాప్తు బృందం స‌భ్యులు తెలిపిన‌ట్టుగా పేర్కొంటూ, ఆ ప‌త్రిక భార‌త్‌పై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేసింది. ఉగ్ర‌వాదుల దాడి తాలూకూ ముంద‌స్తు స‌మాచారం భార‌త్ వ‌ద్ద ఉన్న‌ద‌ని, దాడి కొన్ని గంట‌ల్లోనే ముగిసినా భార‌త్, త‌రువాత చాలా స‌మ‌యం నాటకం కొన‌సాగించింద‌ని, త‌ద్వారా ప్ర‌పంచ దృష్టిని ఆక‌ర్షించి, పాకిస్తాన్‌ని దోషిగా చూప‌డ‌మే భార‌త్ ఉద్దేశ‌మని ఆ ప‌త్రిక రాసింది. చివ‌రికి ఎన్ఐఎ అధికారి తంజిల్ హ‌త్య‌ను సైతం పాక్ మీడియా త‌మ‌కు అనుకూలంగా మ‌లచుకుంది. భార‌తే త‌మ నాట‌కాలు బ‌య‌ట‌ప‌డ‌కుండా ఉండేందుకు ఆ అధికారిని హ‌త్య చేయించిన‌ట్టుగా ఆ ప‌త్రిక పేర్కొంది. భారత్, పాక్ ఆరోప‌ణ‌ల‌ను తీవ్రంగా ఖండించింది. పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై జ‌రిగిన దాడి విష‌యంలో భార‌త్ ఎలాంటి అవాస్త‌వాలు చెప్ప‌డం లేద‌ని, హత్యకు గురైన ఎన్‌ఐఏ అధికారి తంజిల్‌కు అసలు పఠాన్‌కోట్‌ దర్యాప్తుతో ఏమాత్రం సంబంధం లేదని భారత అధికారులు వెల్లడించారు.

First Published:  5 April 2016 12:00 AM GMT
Next Story