పవన్ కోసం తమిళనాట పోటీ

పవన్ సినిమా కోసం తమిళనాట ఏం ఖర్మ… భారతదేశం మొత్తం పోటీ ఉంటుంది. మొదటి రోజు, మొదటి ఆట చూసేద్దామని ప్రతి అభిమానికి ఉంటుంది. కానీ ఇక్కడ విషయం వేరు. ఇక్కడ పవన్ సినిమా కోసం పోటీపడుతోంది ప్రేక్షకులు కాదు… తమిళ హీరోలు. అవును… పవన్ సినిమా విడుదలైన వెంటనే టాక్ కనుక్కోవడానికి కొంతమంది తమిళ హీరోలు రెడీగా ఉన్నారట. సినిమా సూపర్ హిట్ టాక్ రావడమే ఆలస్యం రీమేక్ రైట్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ లిస్ట్ లో శింబు, విజయ్ తో పాటు తాజాగా జీవ, విశాల్ కూడా చేరినట్టు తెలుస్తోంది. ఒకవేళ సినిమా సూపర్ హిట్టయితే వెంటనే లాబీయింగ్ చేసి సినిమా తమిళ రీమేక్ రైట్స్ దక్కించుకోవాలని వీళ్లంతా వెయిట్ చేస్తున్నారు. అందుకే తమిళనాట తెలుగు ప్రేక్షకులతో పాటు ఈ నలుగురు తమిళ హీరోలు కూడా సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ కోసం ఆసక్తిగా కాచుక్కూర్చుకున్నారు. మరి వీళ్లలో పవన్ సినిమా ఎవర్ని వరిస్తుందో చూడాలి. 
Click on Image to Read:
alluarjun
chiru1
Pawan-Kalyan-wife
allu-arjun
sardar-gabbar-singh-ticket