పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థి నేనే

వైఎస్‌ కుటుంబానికి ఎదురులేని పులివెందులలో ఇప్పుడు టీడీపీ తరపున కొత్త నాయకుడు కాలుదువ్వుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పులివెందుల టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేది తానేనంటూ గ్రామాల్లో ప్రచారం తిరుగుతున్నారు.. మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్‌ పేర్ల పార్థసారధి ఇప్పుడిలా చెబుతున్నారు.  వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి తానేనని… పులివెందుల ప్రజలకు అండగా ఉంటానని ప్రకటించారు. రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని చెప్పారు. అయితే పేర్ల పార్థసారధి కామెంట్స్‌పై వెంటనే రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి.  సాధారణంగా ఎవరూ ఎన్నికలకు మూడేళ్ల ముందుగానే తానే అభ్యర్థినని ప్రకటించుకోరు. ఎందుకంటే అలా చెప్పుకుంటే పార్టీలోని మిగిలిన నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతాయి. కానీ పులివెందుల అభ్యర్థి తానేనని పార్థసారధి ఇంత ధైర్యంగా చెప్పుకుంటున్నారంటే అందుకు కారణం వేరే ఉందంటున్నారు. పులివెందుల్లో పోటీ చేసేందుకు టీడీపీ నుంచి  ఎవరూ ముందుకు రారని… కాబట్టి కాసింత ఉత్సాహం ఉంటే చాలు టీడీపీ టికెట్ వచ్చేస్తుందని చెబుతున్నారు.   ఇది వరకు పులివెందుల నుంచి సతీష్ రెడ్డి పోటీ చేసేశారు. కానీ ఆయన ఎప్పుడూ విజయం సాధించలేదు. అనంతరం ఎమ్మెల్సీగా వెళ్లిపోయారు. దీంతో ఇప్పుడు జనానికి పెద్దగా పరిచయం లేని పార్థసారథి ముందుకొస్తున్నారు.

Click on Image to Read:

satishreddy MLC