రాహుల్‌కి తొమ్మిదేళ్ల కొడుకున్నాడు…అత‌ని త‌ల్లి ఎమ్మెల్యే!

ఏ అమ్మాయికి అన్యాయం జ‌రిగినా, ఇలాంటి దుస్థితి మ‌రే అమ్మాయికీ రాకూడద‌ని కోరుకుంటాం. కానీ మ‌న కోరిక నెర‌వేర‌టం లేదు. ప‌దేప‌దే ఇదేమాట‌ని రిపీట్ చేయాల్సిన ప‌రిస్థితులు త‌లెత్తుతున్నాయి. టివిన‌టి ప్ర‌త్యూష బెన‌ర్జీ హ‌త్య కేసులో మొద‌ట అంత‌గా స్పందించ‌ని ఆమె త‌ల్లిదండ్రులు, ఆమె స్నేహితులు బ‌య‌ట‌కు వ‌చ్చి ప‌లు నిజాలు వెల్ల‌డించాక,  నోరుతెర‌చి త‌మ ఆక్రోశం వెళ్ల‌గ‌క్కుతున్నారు. త‌మ కుమార్తెని రాహుల్ కొట్టేవాడ‌ని, తిట్టేవాడ‌ని పోలీసుల‌కు తెలిపారు. కూతురు త‌మ‌తో పాటు ఉంటే ఒప్పుకునేవాడు కాద‌ని, అందుకే తాము త‌మ సొంత ఊర్లో ఉంటున్నామ‌ని, ప్ర‌త్యూష త‌మ‌కు ఫోన్‌చేసినా అత‌నికి న‌చ్చేది కాద‌ని వారు వెల్ల‌డించారు. ప్ర‌త్యూష‌కు స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని తెలుసుకానీ, అవి ఇంత తీవ్ర‌స్థాయిలో ఉన్నాయ‌ని తాము ఊహించ‌లేద‌ని వారు పోలీసుల విచార‌ణ‌లో తెలిపారు. ప్ర‌త్యూష చ‌నిపోయింద‌ని తెలియ‌గానే ఏం చేయాలో అర్థం కాని స్థితిలో తాము స‌రిగ్గా స్పందించ‌లేక‌పోయామని వారు వెల్ల‌డించారు. ప్ర‌త్యూష స్నేహితులు త‌మ‌కు అన్నివిధాలా అండ‌గా నిలిచార‌ని, ఆమె అంత్య‌క్రియల‌ను నిర్వహించిన త‌రువాత, ఆమె ఆత్మ‌కు శాంతి క‌లిగేలా అన్ని కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన త‌రువాత‌  తాము నోరువిప్పుతున్న‌ట్టుగా వారు చెప్పారు. ప్రత్యూష తల్లి సోమ బెన‌ర్జీ రాహుల్ మీద కేసు పెట్టిన‌ట్టుగా తండ్రి శంక‌ర్ తెలిపాడు. తాము త‌మ కూతురినే పోగొట్టుకున్నామ‌ని, ఇక పోగొట్టుకోవ‌డానికి ఏమీ లేద‌ని, రాహుల్‌కి జీవిత ఖైదు, లేదా మ‌ర‌ణ‌శిక్ష ప‌డితీరాల‌ని శంక‌ర్ బెక‌ర్జీ అన్నారు. ఛాతీ నొప్పితో ఆసుప‌త్రిలో ఉన్న రాహుల్‌ని పోలీసులు, అత‌ను డిశ్చార్జి కాగానే అరెస్టు చేసే అవ‌కాశం ఉంది. అయితే తాము ముంద‌స్తు బెయిల్ కోసం ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టుగా రాహుల్ న్యాయ‌వాది తెలిపాడు.

రాహుల్ గురించి బ‌య‌ట‌కు వస్తున్న నిజాలు అత్యంత ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించేలా ఉన్నాయి. అత‌నికి తొమ్మిదేళ్ల కొడుకున్నాడు.  ముంబయిలో నాలుగు ఫ్లాట్స్, కార్లు ఉన్నాయి. అయినా ప్ర‌త్యూష ఇంట్లో ఉండేవాడు. అత‌ని త‌ల్లి ఎమ్మెల్యే. వాళ్ల‌కి త‌న సొంత ఊళ్లో 150 ఎక‌రాల భూమి ఉంది. రాహుల్ ప్ర‌త్యూష‌ని ఆమె పాత అనుబంధాల గురించి అడిగి బాధ‌పెట్టేవాడు. ఆమె ఆర్థిక విష‌యాల‌న్నింటినీ త‌న కంట్రోల్‌లోకి తెచ్చుకున్నాడు. చివ‌రికి ప్ర‌త్యూష‌ను ఇంటి అద్దె క‌ట్ట‌లేని స్థితికి తీసుకువచ్చాడు. జ‌న‌వ‌రిలో ప్ర‌త్యూష త‌న అంకుల్‌కి త‌న బాధ‌ని చెప్పుకుంద‌ని, కాళ్ల‌పై రాహుల్ కొట్టిన దెబ్బ‌ల‌ను చూపించింద‌ని, చ‌నిపోవ‌డానికి ఒక రోజు ముందు కూడా ఆమె త‌న బంధువుకి, త‌ల్లిదండ్రుల‌కు త‌న బాధ‌ల‌ను గురించి చెప్పుకుంద‌ని తెలుస్తోంది. అయితే ప్ర‌త్యూష ఎప్ప‌టిక‌ప్పుడు రాహుల్‌తో త‌న బంధం కొన‌సాగాల‌నే కోరుకుంది. దాంతో ఆమె చివ‌రి వ‌ర‌కు బాధ‌ల‌ను భ‌రిస్తూనే వ‌చ్చింది. ఏదిఏమైనా చిన్నారి పెళ్లికూతురులో ఎంతో తెలివైన అమ్మాయిగా, పరిస్థితుల‌ను చ‌క్క‌దిద్దుకున్న‌ అమ్మాయిగా న‌టించిన ప్ర‌త్యూష నిజ‌జీవితంలో అత్యంత బేల‌గా మిగ‌ల‌టం విషాదం.

Click on Image to Read:

panama-papers

Rajya-Sabha-Seat

harish-rao

ysrcp-mla

gudur-mla-sunil

bramini-lokesh

5eaa7b3e-f096-4ce2-bd70-d8594018f1b6

TDP MLC Buddha Venkanna

jagan1

cbn-panama-1

global-hospital

satishreddy MLC

jagan

rajastan

trs-bjp

ambati