Telugu Global
Others

అధిష్టానం మొట్టికాయ‌లతో నిద్ర‌లేచిన కాంగ్రెస్‌!

అధిష్టానం మొట్టికాయ‌ల‌తో టీపీసీసీ నేత‌లు నిద్ర‌లేచారు. రెండురోజుల నుంచి అధికార ప‌క్షంపై మాట‌ల దాడి మొద‌లు పెట్టారు. కాంగ్రెస్‌కు మొద‌టి నుంచి ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లింల స‌మ‌స్య‌ల‌పై దృష్టి సారించారు. ఎన్నిక‌ల‌కు ముందు ముస్లింల‌కు అమ‌లు చేస్తామ‌న్న 12 శాతం రిజ‌ర్వేష‌న్ల విష‌యంపై కోటి సంత‌కాల సేక‌ర‌ణ ప్రారంభించారు. ఇదే స‌మ‌స్య‌ను అస్ర్తంగా మ‌లుచుకుని అధికార పక్షంపై మాట‌ల దాడి  ముమ్మ‌రం చేశారు. మంత్రి కేటీఆర్‌కు మతిపోయిందంటూ ఘాటైన వ్యాఖ్య‌లు చేస్తున్నారు. మీ నాన్న ఎన్నిక‌ల‌కు […]

అధిష్టానం మొట్టికాయ‌లతో నిద్ర‌లేచిన కాంగ్రెస్‌!
X
అధిష్టానం మొట్టికాయ‌ల‌తో టీపీసీసీ నేత‌లు నిద్ర‌లేచారు. రెండురోజుల నుంచి అధికార ప‌క్షంపై మాట‌ల దాడి మొద‌లు పెట్టారు. కాంగ్రెస్‌కు మొద‌టి నుంచి ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లింల స‌మ‌స్య‌ల‌పై దృష్టి సారించారు. ఎన్నిక‌ల‌కు ముందు ముస్లింల‌కు అమ‌లు చేస్తామ‌న్న 12 శాతం రిజ‌ర్వేష‌న్ల విష‌యంపై కోటి సంత‌కాల సేక‌ర‌ణ ప్రారంభించారు. ఇదే స‌మ‌స్య‌ను అస్ర్తంగా మ‌లుచుకుని అధికార పక్షంపై మాట‌ల దాడి ముమ్మ‌రం చేశారు. మంత్రి కేటీఆర్‌కు మతిపోయిందంటూ ఘాటైన వ్యాఖ్య‌లు చేస్తున్నారు. మీ నాన్న ఎన్నిక‌ల‌కు ముందు చేసిన వాగ్దానాలు ఇవిగో అంటూ విలేక‌రుల స‌మావేశంలో వీడియో క్లిప్పింగుల‌ను చూపెడుతున్నారు. అలాగే సీఎం ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ లో లోపాలు వెల్ల‌డించేలా.. మ‌రో ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌ను రూపొందించేందుకు టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి క‌స‌ర‌త్తులు మొద‌లు పెట్టారు. అలాగే క‌రువు, ప‌శుగ్రాసం, తాగునీటి స‌మ‌స్య‌ల‌పైనా క్షేత్ర‌స్థాయి పోరాటాల‌కు రూప‌క‌ల్ప‌న చేసేందుకు స‌మాయ‌త్తం అవుతున్నారు.
హ‌స్తినాపురంలో ఏం జ‌రిగిందంటే..?
అధికార టీఆర్ ఎస్ ఏం చేసినా.. పెద్ద‌గా ఖండించ‌లేక‌పోవ‌డం, ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్ట‌డంలో విఫ‌లం చెంద‌డంతో ఢిల్లీలోని అధికార ప‌క్షం అల‌ర్ట‌యింది. వెంట‌నే సీనియ‌ర్‌ నేత‌లు జానారెడ్డి, ఎమ్మెల్సీ ష‌బ్బీర్ అలీల‌ను పిలిపించింది. రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌ఛార్జి దిగ్విజ‌య్ సింగ్ వీర‌ద్ద‌రికీ త‌లంటు పోశారు. ఎప్ప‌టిక‌ప్పుడు అధికార ప‌క్షాన్ని ఎండ‌గ‌ట్టాల‌ని,ఇక‌పై దూకుడుగా వెళ్లాల‌ని దిశానిర్దేశం చేశారు. టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డికీ ఈ విష‌యంలో త‌గిన సూచ‌న‌లు చేసింది. గ్రామ‌స్థాయి నుంచి డీసీసీల వ‌ర‌కు పార్టీని ప్ర‌క్షాళ‌న చేయాల‌ని నిర్ణ‌యించింది. పార్టీని యువ‌నాయ‌క‌త్వంతో నింపాల‌ని సూచించింది. కొత్త నాయ‌కుల‌కు రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై ప్ర‌త్యేక్ష శిక్ష‌ణ కూడా ఇవ్వాల‌ని ఆదేశించింది.
First Published:  6 April 2016 2:06 AM GMT
Next Story