ఫిరాయింపు ఎమ్మెల్యేకు కోపం వచ్చింది

వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరిపోయిన ఎమ్మెల్యేలకు తమకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం మాత్రం కోపాన్ని తెప్పిస్తున్నాయి. తమను అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలుగా ప్రచారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక పార్టీ తరపున గెలిచి రాజీనామా చేయకుండా మరో పార్టీలో చేరడం తప్పా ఒప్పా అన్న దానిపై స్పందించేందుకు ఇష్టపడని ఎమ్మెల్యేలు తమపై ప్రతికూల ప్రచారం మాత్రం భరించలేకపోతున్నారు. బుధవారం రాత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా వేసుకున్న నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే సునీల్‌ కుమార్‌ కూడా ఇదే తరహాలోనే స్పందించారు.

తాను టీడీపీకి అమ్ముడుపోయానని ప్రచారం చేయడంపై మండిపడ్డారు. అమ్ముడుపోవడానికి తాను సంతలో వస్తువును కానని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను డబ్బుకు అమ్ముడుపోయినట్టు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. కొన్ని మీడియా సంస్థల్లో సునీల్ కుమార్  30 కోట్లకు అమ్ముడుపోయినట్టు కథనాలు వచ్చాయి. ఇప్పటికే రూ. 10 కోట్లు అడ్వాన్స్‌ కూడా ముట్టిందని కథనాలు వచ్చాయి.  ఈ వార్తలపైనే సునీల్ స్పందించారు. టీడీపీ తనకు పుట్టినిల్లులాంటిదని … అందుకే టీడీపీలోకి వెళ్తున్నానని సునీల్ చెప్పారు.

బుధవారం రాత్రి విజయవాడలో చంద్రబాబును సునీల్ కలిశారు. మంత్రి నారాయణ స్వయంగా ఎమ్మెల్యేను చంద్రబాబు వద్దకు తోలుకెళ్లారు.

Click on Image to Read:

bramini-lokesh

5eaa7b3e-f096-4ce2-bd70-d8594018f1b6

Rajya-Sabha-Seat

panama-papers

harish-rao

chandrababu party

VC-Apparao

Pratyusha-Banerjee-Suicide-

ysrcp-mla

satishreddy MLC

cbn-panama-1

global-hospital