Telugu Global
National

ఎండ అలవెన్స్‌ కోరుతున్న కార్మికులు

దేశంలో ఎండలు మండిపోతుండడంతో ఆ వేడిలో పనిచేయడం చాలా కష్టమౌతోంది. కొన్ని ఫ్యాక్టరీలలో లోహాలను కరిగించే ఉష్ణోగ్రత దగ్గర పనిచేయాల్సి రావడం, బయట ఎండలో పనిచేయాల్సి రావడంతో ఆ వేడికి కార్మికులు డీలా పడిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో పనిచేసే కార్మికులు కొన్నిచోట్ల వేడిమి అలవెన్స్‌ను కోరుతున్నారు. ఇప్పటికే కొన్ని ఫ్యాక్టరీలలో ఫర్నేస్‌ల దగ్గర పనిచేసే కార్మికులకు అలాంటి అలవెన్స్‌లు ఇస్తున్నారు. కొన్ని కార్ల ఫ్యాక్టరీలు తమ కార్మికులకు ఈ వేడిమి అలవెన్స్‌లు అందజేస్తున్నాయి. కార్మికులు ఈ వేడిని […]

ఎండ అలవెన్స్‌ కోరుతున్న కార్మికులు
X

దేశంలో ఎండలు మండిపోతుండడంతో ఆ వేడిలో పనిచేయడం చాలా కష్టమౌతోంది. కొన్ని ఫ్యాక్టరీలలో లోహాలను కరిగించే ఉష్ణోగ్రత దగ్గర పనిచేయాల్సి రావడం, బయట ఎండలో పనిచేయాల్సి రావడంతో ఆ వేడికి కార్మికులు డీలా పడిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో పనిచేసే కార్మికులు కొన్నిచోట్ల వేడిమి అలవెన్స్‌ను కోరుతున్నారు. ఇప్పటికే కొన్ని ఫ్యాక్టరీలలో ఫర్నేస్‌ల దగ్గర పనిచేసే కార్మికులకు అలాంటి అలవెన్స్‌లు ఇస్తున్నారు. కొన్ని కార్ల ఫ్యాక్టరీలు తమ కార్మికులకు ఈ వేడిమి అలవెన్స్‌లు అందజేస్తున్నాయి. కార్మికులు ఈ వేడిని తట్టుకోడానికి కొన్ని ఫ్యాక్టరీలు మజ్జిగ, గ్రీన్‌ సలాడ్స్‌, లెమన్‌ జ్యూస్‌ లాంటివి అందజేస్తున్నాయి. కొన్ని ఫ్యాక్టరీలలో కార్మికులకు డీహైడ్రేషన్‌ రాకుండా రకరకాల లిక్విడ్స్‌ అందజేస్తున్నారు.

ఇప్పటిదాకా కార్మికులను ఫ్యాక్టరీ గేటుదగ్గరే దింపేసే ఫ్యాక్టరీ బస్సులు ఇప్పుడు కార్మికులను ఫ్యాక్టరీల లోపల వాళ్ల వాళ్ల పని ప్రదేశాల దగ్గర వదిలిపెడుతున్నాయి. మొత్తం మీద చాలా ఫ్యాక్టరీలు ఈ వేసవి ఎండల నుంచి తమ కార్మికులను కాపాడుకోవడానికి వివిధ ప్రయత్నాలు చేస్తున్నాయి.

First Published:  7 April 2016 2:37 AM GMT
Next Story