Telugu Global
Cinema & Entertainment

అయోమయంలో పడిన నాని

మారుతి దర్శకత్వంలో ప్రేమకథాచిత్రమ్ అనే సినిమా ఇప్పటికే వచ్చేసింది. మరి ఇందులో మళ్లీ నాని నటించడం ఏంటనే సందేహం అందరికీ కలగవచ్చు. నిజమే…. నాని ఇందులో నటించడం లేదు. కానీ ఇలాంటిదే ఓ కథను ఎంచుకున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని చేస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా ఇదే కోవలో ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ కూడా మార్చేశారు. సినిమాను ఎనౌన్స్ చేసేటప్పుడు థమాకా అనే పేరు ప్రకటించారు […]

అయోమయంలో పడిన నాని
X
మారుతి దర్శకత్వంలో ప్రేమకథాచిత్రమ్ అనే సినిమా ఇప్పటికే వచ్చేసింది. మరి ఇందులో మళ్లీ నాని నటించడం ఏంటనే సందేహం అందరికీ కలగవచ్చు. నిజమే…. నాని ఇందులో నటించడం లేదు. కానీ ఇలాంటిదే ఓ కథను ఎంచుకున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని చేస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా ఇదే కోవలో ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ కూడా మార్చేశారు. సినిమాను ఎనౌన్స్ చేసేటప్పుడు థమాకా అనే పేరు ప్రకటించారు .కానీ ఇప్పుడు ఆ పేరు స్థానంలో మరో రెండు టైటిల్స్ పరిశీలిస్తున్నారు. నాని జెంటిల్ మేన్, ఎవడితడు అనే రెండు టైటిల్స్ ను శ్రీదేవి మూవీస్ బ్యానర్ రిజిస్టర్ చేయించింది. ఇందులో ఒక టైటిల్ ను నాని కొత్త సినిమాకు పెట్టే ఆలోచనలో ఉన్నారు. అయితే థమాకా అనే టైటిల్ నుంచి ఎందుకు డ్రాప్ అయ్యారనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఈ టైటిల్ అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరకాదేమో అనే భయంతోనే థమాకా అనే టైటిల్ నుంచి డ్రాప్ అయినట్టు తెలుస్తోంది.
First Published:  6 April 2016 11:51 PM GMT
Next Story