Telugu Global
Others

ఆ జ‌డ్జి ఇలాంటి తీర్పు ఎలా ఇచ్చాడు:  హైకోర్టు

తెలంగాణ పోలీసు ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన క‌మాండ్ అండ్ కంట్రోల్ రూమ్ (ట్విన్ ట‌వ‌ర్స్‌) నిర్మాణానికి హైకోర్టు తాజా తీర్పుతో అడ్డంకులు తొల‌గిపోయాయి.  ట్విన్ ట‌వ‌ర్స్ నిర్మాణాన్ని నిలిపివేస్తూ.. సింగిల్ జ‌డ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు త‌ప్పుబ‌ట్టింది. ఆ జ‌డ్జి ఆ తీర్పు ఎలా ఇచ్చారు? అని ప్ర‌శ్నించింది. ఇది అభివృద్ధి నిరోధ‌కంగా ఉందని, ఆ ఉత్త‌ర్వుల‌ను కొన‌సాగించ‌డానికి ఎంత‌మాత్రం వీల్లేద‌ని స్ప‌ష్టం చేసింది. బంజారాహిల్స్ రోడ్ నెం.12లో 8 ఎకరాల స్థ‌లంలో ట్విన్ ట‌వ‌ర్స్ నిర్మాణాన్ని […]

ఆ జ‌డ్జి ఇలాంటి తీర్పు ఎలా ఇచ్చాడు:  హైకోర్టు
X
తెలంగాణ పోలీసు ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన క‌మాండ్ అండ్ కంట్రోల్ రూమ్ (ట్విన్ ట‌వ‌ర్స్‌) నిర్మాణానికి హైకోర్టు తాజా తీర్పుతో అడ్డంకులు తొల‌గిపోయాయి. ట్విన్ ట‌వ‌ర్స్ నిర్మాణాన్ని నిలిపివేస్తూ.. సింగిల్ జ‌డ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు త‌ప్పుబ‌ట్టింది. ఆ జ‌డ్జి ఆ తీర్పు ఎలా ఇచ్చారు? అని ప్ర‌శ్నించింది. ఇది అభివృద్ధి నిరోధ‌కంగా ఉందని, ఆ ఉత్త‌ర్వుల‌ను కొన‌సాగించ‌డానికి ఎంత‌మాత్రం వీల్లేద‌ని స్ప‌ష్టం చేసింది.
బంజారాహిల్స్ రోడ్ నెం.12లో 8 ఎకరాల స్థ‌లంలో ట్విన్ ట‌వ‌ర్స్ నిర్మాణాన్ని ప్ర‌భుత్వం త‌ల‌పెట్టింది. ఈ స్థ‌లంలో 5 ఎక‌రాల స్థ‌లం త‌మ‌దేన‌ని కొంద‌రు హైకోర్టు ను ఆశ్ర‌యించారు. దీన్ని విచారించిన సింగిల్ జ‌డ్జి 4 వారాల‌పాటు స్టే విధించింది. స‌రైన ఆధారాలు చూప‌లేద‌ని, ప్ర‌భుత్వ భూమిని మీద‌ని ఎలా వాదిస్తార‌ని పిటిష‌న‌ర్ల‌ను ప్ర‌శ్నించింది. ఈ కేసు విష‌యంలో స్టే ఇచ్చిన జ‌డ్జి తీరుపైనా హైకోర్టు ధ‌ర్మాస‌నం తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసింది. అస‌లు ఇలాంటి తీర్పులు ఎలా ఇచ్చార‌ని విస్మ‌యం వ్య‌క్తం చేసింది. ఈ త‌ర‌హా తీర్పులు అభివృద్ధి నిరోధ‌కాల‌ని వ్యాఖ్యానించింది. హైకోర్టు మంద‌లింపుతో వాజ్యాన్ని ఉప‌సంహ‌రించుకునేందుకు పిటిష‌నర్లు అంగీక‌రించారు.
First Published:  6 April 2016 11:25 PM GMT
Next Story