ఈయన హృదయాన్ని అర్థం చేసుకోవాల్సింది జగనే!

త్వరలోనే రాజకీయాల్లోకి వస్తున్నట్టు నటుడు మోహన్‌ బాబు బుధవారం ప్రకటించారు. అయితే ఏ పార్టీ అన్నది చెప్పలేదు. కానీ అదే సమయంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలను బట్టి చూస్తే మోహన్‌ బాబు మనసులో ఏముందో కొద్దిమేర అర్థమవుతుంది. ఆయన వైసీపీ వైపే మొగ్గుచూపుతున్నట్టుగా ఉంది. ఎందుకంటే వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించడాన్ని తీవ్రపదజాలంలో మోహన్‌ బాబు తప్పుపట్టారు. పార్టీ మారడం అంటే ఎంగిలి మెతుకులకు ఆశపడడమేనని అన్నారు. పార్టీ నచ్చకపోతే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి వెళ్లాలే గానీ ఇలా ఒక కంచంలో అన్నం తిని మరో ఇంటిలోకి వెళ్లడం సరికాదన్నారు. అంటే చంద్రబాబు ఇష్టంగా చేస్తున్న ఆపరేషన్ ఆకర్ష్ ను మోహన్‌ బాబు బహిరంగంగానే తప్పుపట్టారు. అంతే కాదు. నిత్యం పత్రికల్లో కథనాలు చూస్తుంటే… పేదలకు జరుగుతున్న అన్యాయం చూస్తుంటే చాలా బాధగా ఉందన్నారు. పేదలకు అన్యాయం జరుగుతోంది అంటే పరోక్షంగా ప్రభుత్వ విధానాలను తప్పుపట్టడమే. ఇలా ఎటువైపు నుంచి చూసినా మోహన్‌ బాబు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా ఉంది. బహుశా తన మాటల ద్వారా జగన్‌కు మేసేజ్ పంపారు కాబోలు. ఇప్పుడు మోహన్‌ బాబు మనసును అర్థం చేసుకుని పార్టీలోకి ఆహ్వనించాల్సింది జగనే కాబోలు. అయితే వీరిద్దరికి ఎంతవరకు సెట్ అవుతుందన్నది కూడా చూడాలి.

Click on Image to Read:

jc1

lokesh

revanth-reddy

jc-prabhakar-reddy1

mohan-babu

jc-diwakar-reddy

YCP-MLA-Sunil

bramini-lokesh

5eaa7b3e-f096-4ce2-bd70-d8594018f1b6

Rajya-Sabha-Seat

panama-papers

harish-rao

chandrababu party

VC-Apparao

Pratyusha-Banerjee-Suicide-