Telugu Global
Cinema & Entertainment

నాగ చైత‌న్యతో స‌మంత యు ట‌ర్న్..!

మంచి సినిమాలు ఎక్క‌డ వ‌చ్చినా… ఇప్ప‌టి యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ వెంట‌నే స‌మచారం తెలుసుకుని త‌మ‌కు ఏమైన సూటు అవుతుందేమో అని చెక్ చేసుకుంటున్నారు. అలాగే లాంగ్ బ్యాక్ క‌న్న‌డలో లూసియా అనే చిత్రం చేసి సంచ‌ల‌న విజ‌యం అందుకున్న ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ కుమార్.. తాజాగా క‌న్న‌డంలో యు ట‌ర్న్ పేరు తో ఒక థ్రిల్ల‌ర్ మూవి చేశారు. ఈ చిత్రం గురించి తెలుసుకుని.. స‌మంత‌, నాగ చైత‌న్య ప‌వ‌న్ కుమార్ ఆఫీస్ కు వెళ్లార‌ట‌. సినిమాను […]

నాగ చైత‌న్యతో స‌మంత యు ట‌ర్న్..!
X

మంచి సినిమాలు ఎక్క‌డ వ‌చ్చినా… ఇప్ప‌టి యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ వెంట‌నే స‌మచారం తెలుసుకుని త‌మ‌కు ఏమైన సూటు అవుతుందేమో అని చెక్ చేసుకుంటున్నారు. అలాగే లాంగ్ బ్యాక్ క‌న్న‌డలో లూసియా అనే చిత్రం చేసి సంచ‌ల‌న విజ‌యం అందుకున్న ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ కుమార్.. తాజాగా క‌న్న‌డంలో యు ట‌ర్న్ పేరు తో ఒక థ్రిల్ల‌ర్ మూవి చేశారు. ఈ చిత్రం గురించి తెలుసుకుని.. స‌మంత‌, నాగ చైత‌న్య ప‌వ‌న్ కుమార్ ఆఫీస్ కు వెళ్లార‌ట‌. సినిమాను ప్రివ్యూ చూశార‌ట‌. అయితే ఈ సినిమా స‌మంత‌కు బాగా నచ్చిందట‌.

తెలుగు, త‌మిళ లో ఈ సినిమా రిమేక్ చేస్తే బాగుంటుందని అలాగే నాగచైతన్యతో తను చేస్తే బాగుంటుందని దర్శకుడు పవన్ తో ఆమె వ్యక్త పరిచినట్టు భోగట్ట. అంతే కాకుండా ఏకంగా స‌మంతానే రీమేక్ సినిమాకు ప్రొడ్యూస‌ర్ గా వుంటుంద‌నే మ‌రో వార్త కూడా వినిపించింది. క‌ట్ చేస్తే ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ ఈ విష‌యంలో నిజం లేద‌ని తేల్చారు. స‌మంత‌కు న‌చ్చిన విష‌యం వాస్త‌వ‌మే కానీ.. త‌ను ప్రొడ్యూస‌ర్ అనేది నిజం కాద‌ని చెప్పారు. యు ట‌ర్న్ చిత్రం క‌న్న‌డంలో త్వ‌ర‌లో రిలీజ్ చేయ‌డానికి స‌న్న‌హాలు చేస్తున్నారు. ఆ తరువాత తెలుగు రీమేక్ లో సమంత నాగచైతన్య కలిసి నటించబోతున్నారట.

First Published:  7 April 2016 5:52 AM GMT
Next Story