రేవంత్ కొత్త పార్టీలోకి వెళుతున్నారా?

ఓటుకు నోటుకు కేసులో విచార‌ణ ఎదుర్కొంటున్న టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్ వ‌చ్చింది. తెలంగాణ‌లో కేసీఆర్ కు ప్ర‌త్యామ్నాయంగా పార్టీ పెడ‌దామంటూ మ‌ధ్య‌వ‌ర్తి ద్వారా తెలంగాణ‌కు చెందిన ఓ సీనియ‌ర్ నేత రాయ‌బారం పంపారు. టీడీపీ, కాంగ్రెస్‌లు కేసీఆర్‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కోలేక‌పోతున్నాయి, నువ్వూ- నేను క‌లిస్తే రాష్ట్రంలో ఆ లోటు తీరుతుంద‌ని, పైగా పార్టీ వ్య‌వ‌స్థాప‌కునిగా నీ హోదా కూడా పెరుగుతుంద‌ని వివ‌రించారు. కేసీఆర్ వ్య‌తిరేక శ‌క్తులను కూడ‌గ‌డితే.. రాష్ట్రంలో చ‌క్రం తిప్ప‌డం పెద్ద ప‌నేమీ కాద‌ని చెప్పిన‌ట్లు స‌మాచారం. 
బాబుతో కానిది.. మ‌నతో అవుద్దా..!
ఈ ఆఫ‌ర్‌ను రేవంత్ సున్నితంగా తిర‌స్క‌రించిన‌ట్లు తెలుస్తోంది. ప‌క్క రాష్ట్రంలో అధికారంలో ఉండి, కేంద్ర ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉన్న చంద్ర‌బాబే తెలంగాణ సీఎం కేసీఆర్‌ను స‌రిగ్గా ఎదుర్కోలేక‌పోతున్నారు.. మ‌న‌తోని ఏమ‌వుతుంద‌ని రేవంత్ ఎదురు ప్ర‌శ్నించిన‌ట్లు స‌మాచారం.  ఇక ఈ మ‌ధ్య‌కాలంలో కొంద‌రు పార్టీలు, వేదిక‌లంటూ చేసిన హ‌డావుడి అక్క‌డితోనే ఆగిపోయింద‌ని గుర్తుచేశారంట‌. ఇవ‌న్నీ కాద‌ని, నేను టీడీపీలో నుంచి బ‌య‌టికి వ‌చ్చి నీతోపాటు పార్టీ పెడితే.. మ‌నకు జ‌నం ఎన్నిక‌ల్లో 101వ స్థానం క‌ట్ట‌బెడుతార‌ని రేవంత్ స‌మాధాన‌మిచ్చాడ‌ట‌. తాను టీడీపీలో బానే ఉన్నాన‌ని, పార్టీలోనే కొన‌సాగుతాన‌ని స్ప‌ష్టం చేసిన‌ట్లు తెలిసింది. రేవంత్‌కు గాలం వేసిన ఆ తెలంగాణ సీనియ‌ర్ నేత ఎవ‌రా? అన్న ప్ర‌శ్న ఇప్పుడు టీడీపీలో ఊపందుకుంది. ఆయ‌న గ‌తంలో టీడీపీలో కొన‌సాగి, ప్ర‌స్తుతం మ‌రో పార్టీలో కొన‌సాగుతున్నారు. అందుకే ఈ విష‌యం తెలిసిన ప్ర‌తి ఒక్క‌రూ.. టీడీపీ నుంచి ఇత‌ర పార్టీల‌కు వ‌ల‌స వెళ్లిన సీనియ‌ర్ నేత‌ల్లో రేవంత్‌కు కొత్త పార్టీ ప్ర‌తిపాద‌న చేసింది ఎవ‌రై ఉంటారు? అని బుర్ర‌లు బ‌ద్ద‌లు కొట్టుకుంటున్నారు. 

Click on Image to Read:

ysrcp-mla-yellow-media

lokesh-brahmani

YCP-MLA-Sunil

sujana-chowdary

chintu

jc-prabhakar-reddy1

jagan-mohan-babu

jc1

lokesh

mohan-babu

jc-diwakar-reddy

Rajya-Sabha-Seat