Telugu Global
Cinema & Entertainment

తమిళ శ్రీమంతుడు ఇతడే...

మహేష్-కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు సినిమా ఎంత సెన్సేషనల్ విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. బాహుబలి మేనియా కొనసాగుతున్న టైమ్ లో విడుదలైన శ్రీమంతుడు… ఆ సినిమాను ఎదుర్కొని మరీ రికార్డు వసూళ్లు రాబట్టింది. మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన శ్రీమంతుడు సినిమా రీమేక్ రైట్స్ కు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ సినిమాను హిందీలో హృతిక్ రోషన్ తీస్తాడనే ప్రచారం జరుగుతోంది. ఇంతలోనే…. తమిళ శ్రీమంతుడు ఎవరనేది తేలిపోయింది. […]

తమిళ శ్రీమంతుడు ఇతడే...
X
మహేష్-కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు సినిమా ఎంత సెన్సేషనల్ విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. బాహుబలి మేనియా కొనసాగుతున్న టైమ్ లో విడుదలైన శ్రీమంతుడు… ఆ సినిమాను ఎదుర్కొని మరీ రికార్డు వసూళ్లు రాబట్టింది. మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన శ్రీమంతుడు సినిమా రీమేక్ రైట్స్ కు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ సినిమాను హిందీలో హృతిక్ రోషన్ తీస్తాడనే ప్రచారం జరుగుతోంది. ఇంతలోనే…. తమిళ శ్రీమంతుడు ఎవరనేది తేలిపోయింది. తమిళ స్టార్ హీరో అజిత్…. శ్రీమంతుడు సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు. అజిత్ కు బాగా క్లోజ్ అయిన నిర్మాత ఎఎమ్ రత్నం… శ్రీమంతుడు సినిమాపై అతడితో చర్చించినట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే…. తమిళ శ్రీమంతుడులో మహేష్ పోషించిన పాత్రను అజిత్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే తెలుగులో మహేష్ లా…. తమిళ్ లో అజిత్ కూడా రీమేక్ లకు దూరం. మరి శ్రీమంతుడు సినిమా అజిత్ అభిప్రాయాన్ని మార్చేస్తుందేమో చూడాలి.
First Published:  6 April 2016 11:53 PM GMT
Next Story