Telugu Global
Family

రాజును బట్టే రాజ్యం

అది చలి కాలం ఉదయం ఆకాశం నీలంగా వుంది. మేఘాల్లేవు. సూర్య కిరణాలు వెచ్చగా భూమిని తాకుతున్నాయి. చల్లిటిగాలి చెట్లను కదిలిస్తోంది. రామ చిలుకలు ఒక కొమ్మమీది నించీ యింకో కొమ్మ మీదకు ఎగురుతున్నాయి. చెరుకుతోటల్లో పిల్లలు ఆడుకుంటున్నారు. సూర్యకాంతి వాళ్ళతమీద పడి మెరుస్తోంది. ప్రతిదీ అందంగా, ఆహ్లాదంగా, ఆనందంగా వుంది. చలి మంట దగ్గర ముసలి దంపతులు చలికాసుకుంటున్నారు.వాళ్ళు ఎంతో సంతృప్తిగా వున్నారు. ఎంతో దూరం నించీ గుర్తింపు గుర్రపు డెక్కల శబ్దం వినిపించింది. దుమ్ము […]

అది చలి కాలం ఉదయం ఆకాశం నీలంగా వుంది. మేఘాల్లేవు. సూర్య కిరణాలు వెచ్చగా భూమిని తాకుతున్నాయి. చల్లిటిగాలి చెట్లను కదిలిస్తోంది. రామ చిలుకలు ఒక కొమ్మమీది నించీ యింకో కొమ్మ మీదకు ఎగురుతున్నాయి. చెరుకుతోటల్లో పిల్లలు ఆడుకుంటున్నారు. సూర్యకాంతి వాళ్ళతమీద పడి మెరుస్తోంది.

ప్రతిదీ అందంగా, ఆహ్లాదంగా, ఆనందంగా వుంది.

చలి మంట దగ్గర ముసలి దంపతులు చలికాసుకుంటున్నారు.వాళ్ళు ఎంతో సంతృప్తిగా వున్నారు. ఎంతో దూరం నించీ గుర్తింపు గుర్రపు డెక్కల శబ్దం వినిపించింది. దుమ్ము లేచింది. ఒక వ్యక్తి గుర్రం మీద అక్కడకు వచ్చి ఆగాడు. ముసలతను చలికి చేతులు వెచ్చబరచుకుంటున్నాడు. ముసలావిడ తలకు చేతులు అడ్డుపెట్టి అతన్నే పరిశీలించింది.

గుర్రం పై వచ్చిన వ్యక్తి ‘నాకు దాహంగావుంది. కొన్ని నీళ్ళుయివ్వ గలరా?’ అని అడిగాడు ముసలావిడ ‘దాందేంభాగ్యం’ నీళ్ళేమిటి చెరుకురసం యిస్తాను. నాతో బాటురా’ అని అతన్ని చెరుకు తోటలోని తీసుకెళ్ళింది.

ఒక చెరుకు గడను తుంచింది. దాని నిండుగా రసం వుంది అది గ్లాసులో వంచింది గ్లాసునిండింది. ఆ వ్యక్తికి యిచ్చింది. ఆ వ్యక్తి తాగి యింకో గ్లాసు చెరకురసం అడిగాడు.

ముసలావిడ కొడవలితో యింకో చెరకు గడను నరికింది. ఆశ్యర్యకరంగా ఆ చెరుకుగడలో ఒక్క చుక్క కూడా రసం లేదు. పక్కనే వున్న చెరుకు గడల్లో ఒక దానిలో రసం వుండడం యింకోదానిలో రసం లేకపోవడం ఆమెకు ఆశ్యర్యం కలిగించింది. దాంతో ఆమె కళ్ళ నిండుగా నీళ్ళు కదిలాయి.

గుర్రం మీద వచ్చిన వ్యక్తికి ఆశ్చర్యంగా ముసలావిడను చూసి ‘ఎందుకు ఏడుస్తున్నావు’ అన్నాడు.

ఆమె ఏం లేదునాయనా! బహుశా దేవుడికి నా మీద కోపం వచ్చిన ట్లుంది. లేదా భూమి హఠాత్తుగా పొడిగా మారిపోయిందో యివన్నీ కాక ఈ దేశాన్ని పాలించే రాజులో దయాదాక్షిణ్యాలు మాయమయ్యాయో లేకుంటే యిట్లా చెరకు గడ తడి లేకుండా పోవడమన్నది ఎప్పుడు జరగలేదు అంది.

వెంటనే గుర్రం మీద వచ్చిన వ్యక్తి ఆ వృద్దురాలి పాదాలపై వాలి ‘అమ్మా! నన్ను క్షమించు’ అన్నాడు.

నేను నిన్నెందుకు క్షమించాలి నాయనా! అంది

‘అమ్మా! నేనే ఈ దేశం రాజును మొదట నువ్వు చెరుకురసం యిచ్చినపుడు చెరకు రసం తాగుతూ వీళ్ళ పన్ను పెంచాలి. అనుకున్నాను. ఈ భూమి సారవంతమైంది. తెగపంటలు పండిస్తూ లాభాలు గడిస్తున్నారు. ఈ నేల నాది కదా! అనుకుని నా ఆలోచనల్లో మార్పు వచ్చింది. అందుకనే నన్ను మన్నించు అన్నాడు.

రాజు అమ్మా! యిప్పుడు యింకో చెరకు గడను కొట్టు అన్నాడు. వృద్ధురాలు యింకో చెరకు గడను కొట్టింది రసం చిప్పిల్లింది గ్లాసులో నింపింది.

అపుడామె, రాజును బట్టే రాజ్యం అంది.

– సౌభాగ్య

First Published:  6 April 2016 1:02 PM GMT
Next Story