Telugu Global
Family

సాహసవంతుడైన శత్రువు

అక్బర్‌ చక్రవర్తి ఢిల్లీని పాలించేరోజులు. సంచార జాతుల వాళ్ళకు ఇసుకను బళ్ళ మీద తీసుకురమ్మని పనిపెట్టారు. వాళ్ళ నాయకుడు బట్టి చేతుల్తో వణుకుతూ రాజుముందు నిలబడ్డాడు. అక్బర్‌ చక్రవర్తి ఏమైందని అడిగారు. ‘ఆ ప్రాంతపాలకుడయిన లాల్‌మియామా ఇసుక బళ్ళను బలవంతంగా లాక్కుని మీ అక్బరుకు ధైర్యముంటే నన్ను ఓడించి యీ యిసుక బళ్ళను తీసుకెళ్ళమని చెప్పు’ అన్నాడు. ఆ మాటల్తో అక్బర్‌కు ఆగ్రహం కలిగింది. అక్బర్‌ అజాంఖాన్‌ అన్న సేనాధిపతిని పిల్చి ‘మాండ్వాప్రాంతానికి వెళ్ళి లాల్‌మియాను సజీవంగా […]

అక్బర్‌ చక్రవర్తి ఢిల్లీని పాలించేరోజులు. సంచార జాతుల వాళ్ళకు ఇసుకను బళ్ళ మీద తీసుకురమ్మని పనిపెట్టారు. వాళ్ళ నాయకుడు బట్టి చేతుల్తో వణుకుతూ రాజుముందు నిలబడ్డాడు.

అక్బర్‌ చక్రవర్తి ఏమైందని అడిగారు.

‘ఆ ప్రాంతపాలకుడయిన లాల్‌మియామా ఇసుక బళ్ళను బలవంతంగా లాక్కుని మీ అక్బరుకు ధైర్యముంటే నన్ను ఓడించి యీ యిసుక బళ్ళను తీసుకెళ్ళమని చెప్పు’ అన్నాడు.

ఆ మాటల్తో అక్బర్‌కు ఆగ్రహం కలిగింది. అక్బర్‌ అజాంఖాన్‌ అన్న సేనాధిపతిని పిల్చి ‘మాండ్వాప్రాంతానికి వెళ్ళి లాల్‌మియాను సజీవంగా లేదా నిర్జీవంగా పట్టుకునిరా లేకుంటే ఢిల్లీకి రాకు’ అని ఆజ్ఞాపించాడు.

నీరసంగా అజామ్‌ఖాన్‌ అక్బర్‌ చక్రవర్తి దగ్గరకు వచ్చి తన నిస్సహాయత ను ప్రకటించాడు. ‘శత్రువును బంధించి తీసుకురమ్మంటే చేతులు వూపుకుని వచ్చావో. అన్నాడు అక్బర్‌.

రాజా! అతను సాహసి. అతన్ని ఎదుర్కొవడానికి మనకు మరింత సైన్యం కావాలన్నాడు.

మరింత సైన్యంతో అజాంఖాన్‌ దాడి చేశాడు. కొన్నేళ్ళపాటు యుద్ధం జరిగింది. అటో యిటో తేల్చుకోవాలని వాల్‌మియా బహిరంగ యుద్ధానికి ఆయత్త మయాడు. యుద్దం భయంకరంగా జరిగింది. అజాంఖాన్‌ యుద్ధంలో చని పోయాడు. ఎన్ని పథకాలు వేసినా, ప్రణాళికలు వేసినా అపజయం కలిగినందుకు అజాంఖాన్‌ మరణించినందుకు అక్బర్‌ బాధపడ్డాడు.

రాజా సుర్‌ అన్న ఒక అక్బర్‌ సైన్యాధికారుల్లో ఒకడు వచ్చి ‘రాజా! యిది స్వీకరించండి అన్నాడు.

ఏదో ఒక పళ్ళెంలో పెట్టి దానిపై వస్త్రం కప్పారు.

‘ఏమిటది’ అన్నాడు.

రాజాసుర్‌ ఆ గుడ్డను తొలగించి ‘రాజా’ యిది లాల్‌మియాతల’ అన్నాడు. రాజు ఆశ్వర్యపోయాడు. మనం యుద్ధంలో ఓడిపోయాము కదా’ అన్నాడు.

రాజాసుర్‌ ‘రాజా! మేమే అతన్ని సంధికోసం పిలిచాము. సందర్భం చూసి అతన్ని సంహరించాను. సజీవంగానైనా, నిర్జీవంగానైనా అతన్ని’ తెచ్చివ్వమన్నారు కదా! అందుకని తెచ్చానన్నాడు.

అక్బర్‌ సంతోషించి ఆ తలను తీసుకెళ్ళి బజారులో చూపి అంగడి వాళ్ళ దగ్గర ఒక్కో రూపాయి సేకరించమన్నాడు.

సన్నిహితులయిన కొందరు ‘రాజా! ఎన్ని చెప్పినా లాల్‌మియారాజు సాహస వంతుడు అతన్ని మీరు గౌరవించాల్సింది పోయి అవమానించకూడదు’ అన్నారు.

రాజు ఆ మాటల్లో అర్థాన్ని గ్రహించి అతన్ని రాజ లాంఛనలతో అంత్య క్రియలు నిర్వహించి ఎర్రకోట ద్వారాలలో ఒక దానికి అతని పేరు పెట్టాడు.

– సౌభాగ్య

First Published:  6 April 2016 1:02 PM GMT
Next Story