Telugu Global
Cinema & Entertainment

బ్రహ్మోత్సవానికి దారిస్తున్న నితిన్

బ్రహ్మోత్సవం సినిమా శరవేగంగా ముస్తాబవుతోంది. ఉగాది సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈనెల 24న తిరుపతిలో ఆడియో ఫంక్షన్ ను కూడా ఘనంగా నిర్వహించాలని ఫిక్స్ అయ్యారు. కుదిరితే సినిమాను మే 6న థియేటర్లలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు అదే రోజున తన సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు నితిన్. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న అ..ఆ సినిమాను కుదిరితే మే 6న విడుదల చేయాలనుకున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా […]

బ్రహ్మోత్సవానికి దారిస్తున్న నితిన్
X
బ్రహ్మోత్సవం సినిమా శరవేగంగా ముస్తాబవుతోంది. ఉగాది సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈనెల 24న తిరుపతిలో ఆడియో ఫంక్షన్ ను కూడా ఘనంగా నిర్వహించాలని ఫిక్స్ అయ్యారు. కుదిరితే సినిమాను మే 6న థియేటర్లలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు అదే రోజున తన సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు నితిన్. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న అ..ఆ సినిమాను కుదిరితే మే 6న విడుదల చేయాలనుకున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించాడు. అయితే బ్రహ్మోత్సవం సినిమాకు దారివ్వాలనే ఫిక్స్ అయ్యాడు నితిన్. మహేష్ సినిమా కనుక మే 6న వస్తున్నట్టు అధికారికంగా ప్రకటిస్తే… తన సినిమాకు మరో 2 వారాల గ్యాప్ ఇవ్వాలనుకుంటున్నాడు. తిరుపతిలో జరిగే ఆడియో ఫంక్షన్ లో బ్రహ్మోత్సవం విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారు. ఆ తర్వాత తన సినిమా విడుదలపై ఓ నిర్ణయం తీసుకుంటాడు నితిన్.
First Published:  7 April 2016 10:37 PM GMT
Next Story