సర్దార్ వేట మొదలైంది

ఉగాది సందర్భంగా తెలుగుప్రజలంతా సంబరాలకు సిద్ధమౌతుంటే… అదే ఉగాది రోజున పవన్ అభిమానులు ఉదయాన్నే వేడుక షురూ చేశారు. అర్థరాత్రి నుంచే సర్దార్ గబ్బర్ సింగ్ థియేటర్ల వద్ద వేడి మొదలైంది. అర్థరాత్రి షోలతో పాటు… ఈరోజు ఉదయం కూడా చాలా ప్రాంతాల్లో షోలు నడిచాయి. ఔట్ లైన్ టాక్ ఇప్పటికే వచ్చేసింది. అటు ఓవర్సీస్ లో కూడా సర్దార్ మేనియా పీక్స్ కు వెళ్లిపోయింది. ఎన్నడూ లేని విధంగా బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాలతో పాటు అరబ్ దేశాల్లో కూడా సర్దార్ సినిమాకు సంబంధించి ప్రీమియర్లు ప్రదర్శించారు. అర్థరాత్రి వేళ, మంచు అని కూడా చూడకండా విదేశాల్లో చాలామంది పవన్ అభిమానులు థియేటర్లకు పరుగులుపెట్టారు. విదేశాల్లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ దాదాపు 90శాతం ఇప్పటికే పూర్తయింది. కంప్లీట్ రిపోర్ట్ కావాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే. 

Click on Image to Read:

Bahubali-sardar

sardaar-gabbar-singh

pawan-surya-bunny

pawan

allu-arjun

ramcharan

chiru1

ram-charan-bunny

alluarjun

rgv1