బాబు ప్రభుత్వం పై ఈయనకు కోపం రావడం ఏమిటి?

చంద్రబాబు ప్రభుత్వ విధానాలపై రాజ్యసభ మాజీ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ మండిపడ్డారు. ప్రభుత్వ విధానాలు చూస్తూ వుంటే ఇది “ఉగాది కాదు దగాదిలాగా” వుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. తెలుగు భాష పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైకరిని నిరసిస్తూ రాజమండ్రిలో రెండు గంటలపాటు ఎండలో నిల్చొని “అవేదన దీక్ష” చేశారు.

తెలుగువారి రాజధాని అని చెబుతూ అమరావతి శంకుస్థాపన శిలాపలకాన్ని ఇంగ్లీషులో ఏర్పాటు చేయడాన్ని తప్పుపట్టారు. చివరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బడ్జెట్‌ను కూడా ఇంగ్లీషులో ప్రవేశపెట్టడం దారుణమన్నారు. పక్కనున్న తెలంగాణలో మాత్రం బడ్జెట్‌ను తెలుగులోనే ప్రవేశపెట్టారని అభినందించారు. రెండుగంటలపాటు ఎండలో నిల్చొని నిరసన తెలిపిన లక్ష్మీ ప్రసాద్‌కు బీజేపీ ఎంమ్మెల్సీ సోమువీర్రాజు మద్దతు తెలిపారు. చంద్రబాబు విషయంలో సానుకూలంగానే వుండే వ్యక్తులు కూడా ఇలా నిరసనకు దిగడం చర్చనీయాంశమైంది.

Click on Image to Read:

ysrcp-panchanga-sravanam

pawan-sardar-gabbar

kamineni

sujana

sardaar-gabbar-singh-movie-

cbn-devansh

cpi-narayana

lokesh-brahmani

ysrcp-mla-yellow-media

chintu

jc-prabhakar-reddy1

jagan-mohan-babu

jc1

lokesh