వైసీపీ పంచాంగంలో ఇవి నిజమయ్యేనా?

ఉగాది రోజు ప్రతిపార్టీ ఆఫీసులోనూ పంచాంగ శ్రవణం సాధారణంగా జరుగుతున్నదే. వైసీపీ ఆఫీసులోనూ ఉగాది పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రంచాంగకర్త మారేపల్లి రామచంద్ర శాస్త్రి వైసీపీకి ఈ ఏడాది అన్ని విధాలుగా కలిసి వస్తుందని చెప్పారు. పార్టీ ఫిరాయింపుదారుల ప్రస్తావన కూడా పంచాంగంలోరావడం విశేషం. పార్టీ ఫిరాయించిన వారికి ఇకపై అన్ని కష్టాలేనని, భవిష్యత్తు ఉండదని పంచాంగకర్త వెల్లడించారు.

ఏపీలో పాలకులకు గ్రహాలు అనుకూలించే పరిస్థితి లేదన్నారు. తనపై ప్రభుత్వం చేసే కుట్రలు, కేసుల నుంచి జగన్‌ బయటపడుతారని చెప్పారు. ఈఏడాది వర్షాభావం పరిస్థితులుంటాయని పాలకులకు ప్రతికూలపరిస్థితులే ఉంటాయని చెప్పారు. అయితే ఈ పంచాంగాలను ఎంతవరకు నమ్మవచ్చన్న అనుమానం కలుగుతోంది. ఏ పార్టీ ఆఫీసులో జరిగే పంచాంగ శ్రవణాలు ఆయా పార్టీలకు అనుకూలంగానే ఉంటున్నాయి. వైసీపీ ఆఫీసులో జరిగిన ఉగాది వేడుకలకు జగన్, ఆయన తల్లి విజయమ్మ, తెలంగాణ వైసీపీ అధ్యక్షుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, విజయసాయిరెడ్డి తదితరులు హాజరయ్యారు.

Click on Image to Read:

pawan-sardar-gabbar

Yarlagadda-Lakshmi-Prasad

kamineni

sujana

sardaar-gabbar-singh-movie-

lokesh

cbn-devansh