Telugu Global
Cinema & Entertainment

అజారుద్దీన్ కొడుకు హీరోగా సినిమా

అజారుద్దీన్ పేరుతో ఇప్పటికే ఓ సినిమా వస్తోంది. కేవలం అజారుద్దీన్ క్రికెట్ జీవితం, వ్యక్తిగత జీవితాన్ని అందులో చూపిస్తున్నారు. మరోవైపు నిజంగానే అజారుద్దీన్ కొడుకు హీరో అయిపోయాడు. అవును… అజార్ కొడుకును హీరోగా పరిచయం చేస్తూ ఇద్దరికీ కొత్తేగా అనే సినిమా రాబోతోంది. నాకూ ఓ లవరుంది అనే సినిమాను నిర్మించిన కె.సురేష్ బాబు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. హీరోయిన్ గా ఓ కొత్తమ్మాయిని తీసుకుంటున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా దీన్ని తెరకెక్కిస్తారు. […]

అజారుద్దీన్ కొడుకు హీరోగా సినిమా
X
అజారుద్దీన్ పేరుతో ఇప్పటికే ఓ సినిమా వస్తోంది. కేవలం అజారుద్దీన్ క్రికెట్ జీవితం, వ్యక్తిగత జీవితాన్ని అందులో చూపిస్తున్నారు. మరోవైపు నిజంగానే అజారుద్దీన్ కొడుకు హీరో అయిపోయాడు. అవును… అజార్ కొడుకును హీరోగా పరిచయం చేస్తూ ఇద్దరికీ కొత్తేగా అనే సినిమా రాబోతోంది. నాకూ ఓ లవరుంది అనే సినిమాను నిర్మించిన కె.సురేష్ బాబు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. హీరోయిన్ గా ఓ కొత్తమ్మాయిని తీసుకుంటున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా దీన్ని తెరకెక్కిస్తారు. అజార్ కొడుకు అబ్బాస్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో అబ్బాస్ సరసన ముగ్గురు భామలు హీరోయిన్లుగా కనిపిస్తారు. త్వరలోనే ఈ సినిమా ప్రారంభోత్సవం గ్రాండ్ గా జరుగుతుంది. అజార్ ప్రత్యేక అతిథిగా వస్తాడు. ఈ సినిమాకు ఇద్దరికీ కొత్తేగా అనే టైటిల్ ను పర్ ఫెక్ట్ గా పెట్టారు. ఎందుకంటే హీరోగా అబ్బాస్… దర్శకుడిగా సురేష్ బాబు… ఇద్దరికీ కొత్తేగా….
First Published:  8 April 2016 10:06 PM GMT
Next Story