Telugu Global
Cinema & Entertainment

హీరో వేణుపై కేసు పెట్టిన వైద్యురాలు

సినీ హీరో వేణుపై కేసు నమోదు అయ్యింది. ఇరాన్‌కి చెందిన ఒక మహిళా వైద్యురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు వేణు, అతడి భార్య అనుపమా చౌదరిపై కేసు నమోదు చేశారు. ఇరాన్‌కి చెందిన డాక్టర్‌ ఫాతేమీ బెగంపేటలో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. ఏడు నెలల క్రితం వేణుకి చెందిన బంజార్‌హిల్స్‌ రోడ్‌ నెం.10 లోని జీపీ రెసిడెన్స్‌ ఫ్లాట్‌ నెం. 302లో అద్దెకు దిగారు. అద్దె నెలకు 29,000 రూపాయలుగా మాట్లాడుకున్నారు. మూడు నెలల అడ్వాన్స్‌గా 88 […]

హీరో వేణుపై కేసు పెట్టిన వైద్యురాలు
X

సినీ హీరో వేణుపై కేసు నమోదు అయ్యింది. ఇరాన్‌కి చెందిన ఒక మహిళా వైద్యురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు వేణు, అతడి భార్య అనుపమా చౌదరిపై కేసు నమోదు చేశారు. ఇరాన్‌కి చెందిన డాక్టర్‌ ఫాతేమీ బెగంపేటలో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. ఏడు నెలల క్రితం వేణుకి చెందిన బంజార్‌హిల్స్‌ రోడ్‌ నెం.10 లోని జీపీ రెసిడెన్స్‌ ఫ్లాట్‌ నెం. 302లో అద్దెకు దిగారు. అద్దె నెలకు 29,000 రూపాయలుగా మాట్లాడుకున్నారు. మూడు నెలల అడ్వాన్స్‌గా 88 వేల రూపాయలను వేణు, అతని భార్య అనుపమా చౌదరిలకు డాక్టర్‌ ఫాతేమీ చెల్లించారు.

తాజాగా ఫ్లాట్‌ కాళీ చేసేందుకు ఫాతేమీ సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని వేణు దంపతులకు తెలియజేసి అడ్వాస్‌గా ఇచ్చిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కోరారు. అయితే వేణు, అతడి భార్య అనుపమా చౌదరి డబ్బుచెల్లించకుండా మొండికేశారు. ఫ్లోరింగ్‌పై చిన్నపాటి డ్యామేజ్‌ జరిగిందని అందుకు అడ్వాన్స్‌ ఇవ్వడం కుదరదని చెప్పారు. ఈ సమయంలో తనను బెదిరించారని కూడా డాక్టర్‌ ఫాతేమీ చెబుతున్నారు. తనకు న్యాయం చేయాలని వేణు, అతని భార్య అనుపమా చౌదరిపై చర్యలు తీసుకోవాలి పోలీసులకు కోరారు.

Click on Image to Read:

lokesh11

sardar-gabbar-singh

pawan-sardar-gabbar-singh

pawan-sardar-gabbar

cbn-chaganti

ysrcp-panchanga-sravanam

pawan12345

sardaar-gabbar-singh-movie-

First Published:  9 April 2016 8:53 AM GMT
Next Story