శ్రీకాంత్ సినిమాకు ఊహించని ప్రచారం

హీరో శ్రీకాంత్ కు పోలీసులు షాక్ ఇచ్చారు. మెంటల్ పోలీస్ అనే టైటిల్ పెట్టడంపై పోలీస్ అధికారుల సంఘం ఆయనకు లీగల్ నోటీస్ పంపింది. అంతే కాదు…ఆ టైటిల్ ను వెంటనే మార్చాలని కూడా డిమాండ్ చేసింది. మెంటల్ పోలీస్ అనే పేరు వ్యవస్థనే తక్కువ చేసేలా ఉంది. పైగా పోస్టర్లు కూడా పోలీసులను అవమానపరిచేలా ఉన్నాయి. మెడలో చెప్పుల దండతో ఉండటం కూడా పోలీసు వ్యవస్థపై గౌరవం తగ్గించేలా ఉంది. వెంటనే పేరు మార్చాలని దీనికి బాధ్యులుగా ఉన్న హీరో శ్రీకాంత్, దర్శక, నిర్మాతలకు పోలీసుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి లీగల్ నోటీస్ లు పంపారు. అయితే పోలీసులను అగౌరపరిచే ఉద్దేశం తమకు లేదని, కేవలం అది ఒక పాత్ర మాత్రమేనని… అందులో మంచినే ఎక్కువ చూపిస్తున్నామని యూనిట్ అంటోంది. పోలీసులకు ఇబ్బందిగా అనిపిస్తే చర్చించి పేరు మార్పుపై కూడా ఆలోచిస్తామంటోంది. దీనిపై హీరో శ్రీకాంత్ కూడా ఇబ్బందిగా ఫీలయ్యారట. టైటిల్ మార్చుకుంటే సరిపోద్దనే ఆలోచనలో ఉన్నారట. అయితే దీని వల్ల శ్రీకాంత్ సినిమాకు పరోక్షంగా మంచి పబ్లిసిటీనే వచ్చింది.