లోకేష్ గురించి జోస్యం చెప్పిన ప్రముఖ స్వామీజీ

ఉగాది పంచాంగ శ్రవణం సందర్భంగా ప్రముఖ స్వామీజీ పరిపూర్ణానంద‌ సరస్వతి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ పిల్లలు, కొడుకుల విషయంలోజాగ్రత్తగా ఉండాలని సూచించారు. అదే సమయంలో చంద్రబాబును ప్రత్యేకంగా హెచ్చరించారు. ”రెండు రాష్ట్రాల సీఎంలకు మరీమరీ సూచన. మీ కొడుకులు,పిల్లలను జాగ్రత్తగా ఉంచండి. మీకు సన్‌ స్ట్రోక్ ఉంది కాబట్టి. కొన్నిప్రత్యేకమైన చర్యలు , జాగ్రత్తలు తీసుకోవాలి. నాకు అనిపిస్తోంది. ఇక్కడ కేటీఆర్‌ ఆల్‌మోస్ట్ సమర్థవంతంగా చేస్తున్నారు. ఏదో చెబుతూ ముందుకెళ్తున్నారు. బహుశా ఇక ఈ సన్‌ స్ట్రోక్ ఉంటే… డాష్ డాష్” అని అన్నారు. ఆయన పేరు నేరుగా చెప్పడం ఇష్టం లేకనే డాష్ అంటున్నానని చెప్పారు. అంటే పరోక్షంగా లోకేష్ గురించే పరిపూర్ణానంద‌ సరస్వతి స్వామి కామెంట్స్ చేశారని అందరికీ అర్థమైపోయింది. సన్‌ స్ట్రోక్ అంటే ఎస్‌యూఎన్ సన్ (SUN) కాదని… ఎస్‌ఓఎన్ సన్ (SON) అని క్లారిటీ ఇచ్చారు. ఏపీకి ప్రత్యేకహోదా వచ్చే అవకాశాలు కనిపించడం లేదన్నారు. కేంద్రంతో ఏపీ సంబంధాలు మరింత బలహీనపడే సూచనలు ఉన్నాయన్నారు. పోలీస్‌ శాఖలో ప్రముఖ స్థానాల్లో ఉన్నవారికి సంబంధించిన‌ కీలక విషయాలు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ లోపు బయటకు వస్తాయన్నారు. పోలీస్ శాఖలోని ప్రముఖుల అవినీతి బట్టబయలయ్యే అవకాశం ఉందన్నారు.

 

Click on Image to Read:

devansh

sardar-gabbar-singh

pawan-sardar-gabbar-singh

pawan-sardar-gabbar

venu

cbn-chaganti

Yarlagadda-Lakshmi-Prasad

pawan12345

kamineni

sardaar-gabbar-singh-movie-