Telugu Global
Cinema & Entertainment

హరీష్ ను పక్కనపెట్టి తప్పుచేశారా...

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో సడెన్ గా హరీష్ శంకర్ తెరపైకి వచ్చాడు. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీని అందించిన హరీష్ ను… సీక్వెల్ లో కూడా కొనసాగించకుండా పక్కనపెట్టి తప్పుచేశారా అనే చర్చ మొదలైంది. దబంగ్ సినిమాకు సీక్వెల్ గా గబ్బర్ సింగ్ వచ్చింది. రీమేక్ అనే భావన రాకుండా… పవన్ మేనరిజమ్స్ కు తగ్గట్టు కథ-కథనాల్లో హరీష్ శంకర్ అద్భుతమైన మార్పులు చేశాడు. సినిమా ఎక్కడా బోరు […]

హరీష్ ను పక్కనపెట్టి తప్పుచేశారా...
X
సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో సడెన్ గా హరీష్ శంకర్ తెరపైకి వచ్చాడు. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీని అందించిన హరీష్ ను… సీక్వెల్ లో కూడా కొనసాగించకుండా పక్కనపెట్టి తప్పుచేశారా అనే చర్చ మొదలైంది. దబంగ్ సినిమాకు సీక్వెల్ గా గబ్బర్ సింగ్ వచ్చింది. రీమేక్ అనే భావన రాకుండా… పవన్ మేనరిజమ్స్ కు తగ్గట్టు కథ-కథనాల్లో హరీష్ శంకర్ అద్భుతమైన మార్పులు చేశాడు. సినిమా ఎక్కడా బోరు కొట్టదు, టెంపో తగ్గదు. అలా గబ్బర్ సింగ్ సినిమాతో తనదైన మార్క్ వేశాడు. ఆ సినిమాలో గబ్బర్ సింగ్ పాత్ర మేనరిజమ్స్, డైలాగ్స్, కథాగమనం అన్నింటిపై హరీష్ కు పట్టుంది. అలాంటి దర్శకుడ్ని ఎవరైనా సీక్వెల్ లో కొనసాగిస్తారు. కానీ పవన్ మాత్రం సంపత్ నందికి అవకాశం ఇచ్చాడు. సంపత్ నంది కూడా చాలా రోజులు గబ్బర్ సింగ్ తో ట్రావెల్ చేసి సైడైపోయాడు. కనీసం అతడ్ని కంటిన్యూ చేసినా సినిమా రిజల్ట్ మరోలా ఉండేదేమో. ఎందుకంటే… అప్పటికే గబ్బర్ సింగ్ పై అతడు ఓ అవగాహనకు వచ్చాడు. ఇంతలోనే సంపత్ స్థానంలో బాబి వచ్చాడు. ఇలా ఒకే ప్రాజెక్టుకు ముగ్గురు దర్శకులు మారడంతో సినిమాలో ఆత్మ మిస్సయింది. రివ్యూల్లో అదే కనిపించింది. ఇప్పుడు రిజల్ట్ లో కూడా అదే కనిపిస్తోంది.
First Published:  10 April 2016 12:29 AM GMT
Next Story