Telugu Global
Cinema & Entertainment

వందో సినిమాలో ఇద్దరు బాలయ్యలు

బాలయ్య వందో సినిమాకు సంబంధించి మరో ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో నటసింహం రెండు రూపాల్లో కనిపిస్తాడట. అంటే… డ్యూయల్ రోల్ లో కనువిందు చేయబోతున్నాడన్నమాట. ఈ విషయాన్ని యూనిట్ వర్గాలు పరోక్షంగా అంగీకరిస్తున్నాయి. ఓ మంచి రోజు చూసుకొని ఈ విషయాన్ని కూడా అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. ద్విపాత్రాభినయం చేయడం బాలయ్యకు కొట్టినపిండి. ఇప్పటివరకు తెలుగులో ఏ హీరో చేయనన్ని సార్లు డ్యూయల్ రోల్ లో కనిపించి మెప్పించారు బాలయ్య. ప్రతిష్టాత్మక తన […]

వందో సినిమాలో ఇద్దరు బాలయ్యలు
X
బాలయ్య వందో సినిమాకు సంబంధించి మరో ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో నటసింహం రెండు రూపాల్లో కనిపిస్తాడట. అంటే… డ్యూయల్ రోల్ లో కనువిందు చేయబోతున్నాడన్నమాట. ఈ విషయాన్ని యూనిట్ వర్గాలు పరోక్షంగా అంగీకరిస్తున్నాయి. ఓ మంచి రోజు చూసుకొని ఈ విషయాన్ని కూడా అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. ద్విపాత్రాభినయం చేయడం బాలయ్యకు కొట్టినపిండి. ఇప్పటివరకు తెలుగులో ఏ హీరో చేయనన్ని సార్లు డ్యూయల్ రోల్ లో కనిపించి మెప్పించారు బాలయ్య. ప్రతిష్టాత్మక తన వందో సినిమాలో కూడా అతను ద్విపాత్రాభినయంలోనే కనిపిస్తారని తెలుస్తోంది. ఒక పాత్రలో గౌతమీపుత్ర శాతకర్ణగా… మరోపాత్రలో నేటితరం యువకునిగా కనిపిస్తారని సమాచారం. చూస్తుంటే… ఇది పూర్తిస్థాయి చారిత్రక సినిమాలా కాకుండా… ఆదిత్య-369 తరహాలో ఫాంటసీ బాటలో నడిచే చిత్రంగా కనిపిస్తోంది.
First Published:  11 April 2016 11:42 PM GMT
Next Story