Telugu Global
National

వేగమే ఆమె జీవితం....అదే మృత్యువూ అయ్యింది!

అత్యంత వేగంగా బైక్ న‌డ‌ప‌డంలో రికార్డులు సృష్టించిన ఆమె ఆ వేగం కార‌ణంగానే ప్రాణాల పోగొట్టుకోవాల్సి వ‌చ్చింది. దేశంలోనే టాప్ మ‌హిళా మోటార్ సైక్లిస్ట్‌గా పేరు తెచ్చుకున్న వీను పాలివ‌ల్ ఓ రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందింది. మధ్యప్రదేశ్‌లోని విదీషా జిల్లాలో సోమవారం సాయంత్రం ఈ దారుణం జ‌రిగింది. వీను, హార్లీ డేవిడ్‌స‌న్‌ బండిపై వెళుతుండ‌గా అది స్కిడ్ అవ‌డంతో ప్ర‌మాదం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌కి 100 కి.మీలు దూరంలో ఉన్న గ్యారాస్‌పూర్‌ ప్రాంతంలో బైక్ […]

వేగమే ఆమె జీవితం....అదే మృత్యువూ అయ్యింది!
X

అత్యంత వేగంగా బైక్ న‌డ‌ప‌డంలో రికార్డులు సృష్టించిన ఆమె ఆ వేగం కార‌ణంగానే ప్రాణాల పోగొట్టుకోవాల్సి వ‌చ్చింది. దేశంలోనే టాప్ మ‌హిళా మోటార్ సైక్లిస్ట్‌గా పేరు తెచ్చుకున్న వీను పాలివ‌ల్ ఓ రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందింది. మధ్యప్రదేశ్‌లోని విదీషా జిల్లాలో సోమవారం సాయంత్రం ఈ దారుణం జ‌రిగింది. వీను, హార్లీ డేవిడ్‌స‌న్‌ బండిపై వెళుతుండ‌గా అది స్కిడ్ అవ‌డంతో ప్ర‌మాదం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌కి 100 కి.మీలు దూరంలో ఉన్న గ్యారాస్‌పూర్‌ ప్రాంతంలో బైక్ అదుపు త‌ప్పి బోల్తా ప‌డ‌టంతో వీను తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. జైపూర్‌కి చెందిన వీను, హార్లే డేవిడ్‌స‌న్‌ బైక్‌మీద దేశవ్యాప్తంగా ప్ర‌యాణం చేస్తున్నారు. ఆమెతో పాటు మ‌రో బైక్‌మీద తోటి బైక్ రేస‌ర్ దీపేశ్ త‌న్వ‌ర్ కూడా ప్ర‌యాణం చేస్తున్నారు. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే దీపేశ్, వీనుని స్థానిక ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కానీ అప్ప‌టికే ఆమె మృతి చెందిన‌ట్టుగా డాక్ట‌ర్లు తెలిపారు. హార్లే డేవిడ్‌స‌న్ బైక్‌ల‌పై గంట‌కు 180 కిలోమీట‌ర్ల వేగంతో ప్ర‌యాణం చేయ‌గ‌ల వీను, దేశంలోనే టాప్‌ మ‌హిళా బైక్‌రేస‌ర్‌గా గుర్తింపు పొందారు. దేశ‌వ్యాప్తంగా బైక్‌పై ప్ర‌యాణం చేస్తూ, ఆ విశేషాల‌ను ఒక డాక్యెమెంట‌రీగా తీయాల‌ని వీను ఆశించారు. అయితే ఆ ప్ర‌య‌త్నంలోనే ఆమె ప్రాణాలు పోగొట్టుకోవ‌డం దుర‌దృష్ట‌క‌రం.

First Published:  11 April 2016 9:00 PM GMT
Next Story