Telugu Global
Cinema & Entertainment

సర్దార్ నష్టాల చిట్టా ఇది

భారీ అంచనాలతో వచ్చాడు. ఏకంగా బాహుబలినే అధిగమించేస్తాడేమో అనిపించాడు. అంతే స్థాయిలో ప్రంపచవ్యాప్తంగా విడుదల కూడా చేశాడు. కానీ పవన్ ఒకటి తలిస్తే విధి మరోలా పలకరించింది. లాభాలా మాట అటుంచి సర్దార్ సినిమాకు ప్రతి ఏరియా నుంచి నష్టాలు పలకరిస్తున్నాయి. ప‌వ‌న్ మేనియా, గ‌బ్బ‌ర్‌సింగ్ సీక్వెల్ క్రేజ్ కూడా సినిమాని ఫెయిల్యూర్ బాట నుంచి త‌ప్పించ‌లేక‌పోయాయి. తొలి వీకెండ్ అంటే మొద‌టి మూడు రోజుల‌కి ఈ సినిమా ఏపీ, తెలంగాణ‌లో కేవ‌లం 30 కోట్ల షేర్‌తోనే […]

సర్దార్ నష్టాల చిట్టా ఇది
X
భారీ అంచనాలతో వచ్చాడు. ఏకంగా బాహుబలినే అధిగమించేస్తాడేమో అనిపించాడు. అంతే స్థాయిలో ప్రంపచవ్యాప్తంగా విడుదల కూడా చేశాడు. కానీ పవన్ ఒకటి తలిస్తే విధి మరోలా పలకరించింది. లాభాలా మాట అటుంచి సర్దార్ సినిమాకు ప్రతి ఏరియా నుంచి నష్టాలు పలకరిస్తున్నాయి. ప‌వ‌న్ మేనియా, గ‌బ్బ‌ర్‌సింగ్ సీక్వెల్ క్రేజ్ కూడా సినిమాని ఫెయిల్యూర్ బాట నుంచి త‌ప్పించ‌లేక‌పోయాయి. తొలి వీకెండ్ అంటే మొద‌టి మూడు రోజుల‌కి ఈ సినిమా ఏపీ, తెలంగాణ‌లో కేవ‌లం 30 కోట్ల షేర్‌తోనే స‌రిపెట్టుకుంది. ఆంధ్రా, నైజాం, సీడెడ్ ఏరియాస్‌లో స‌ర్దార్‌.. 30.61 కోట్ల‌ను మాత్ర‌మే వ‌సూళ్లు సాధించ‌గ‌లిగింది. ఈ మూడు ఏరియాస్‌లో సినిమా సుమారు 61 కోట్ల‌కు పైగా అమ్ముడుపోయింది. ఒక్క నైజాంలోనే ప్రముఖ నిర్మాత దిల్ రాజు సుమారు 21 కోట్లు వెచ్చించి రైట్స్ తీసుకున్నాడు. ఈ ఏరియాలో కేవ‌లం 8.46 కోట్ల‌ను మాత్ర‌మే సాధించ‌గ‌లిగింది. ప్ర‌స్తుతం ఉన్న టాక్‌తో మ‌రో మూడు కోట్లు వ‌స్తే గ్రేట్‌. ఇటు, ఆంధ్రా సీడెడ్‌లోనూ సేమ్ సీన్‌. టోట‌ల్‌గా లాంగ్ ర‌న్‌లో ఈ మూవీ తెలుగు రాష్ట్రాల‌లో 35 కోట్లు క‌లెక్ట్ చెయ్య‌డం కూడా క‌ష్ట‌మే.
First Published:  11 April 2016 11:38 PM GMT
Next Story