Telugu Global
National

100నెంబ‌ర్‌కి ఫోన్ చేసి తండ్రిని కాపాడుకున్న చిన్నారి!

ప‌దేళ్ల పాప పోలీస్ స్టేష‌న్‌కి ఫోన్ త‌న తండ్రి ప్రాణాలు కాపాడుకున్న ఘ‌ట‌న కోల్‌క‌తాలో జ‌రిగింది.  హెల్ప్‌లైన్ నెంబ‌ర్ 100కి వ‌చ్చిన ఓ కాల్‌ని రిసీవ్ చేసుకున్న పోలీసుల‌కు ఓ చిన్నారి గొంతు… మా నాన్న ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నాడు, కాపాడండి అంటూ ఏడుస్తూ వినిపించింది. అయితే  పోలీసులు ముందు అదేదో ఆక‌తాయిల ప‌ని అనుకున్నారు. కానీ ఆపాప తన తండ్రి ఒంటికి నిప్పంటించుకున్నాడ‌ని, చెబుతూ ఏడుస్తుంటే దాన్ని ఫేక్ కాల్‌గా భావించి వ‌దిలేయ‌లేక‌పోయారు.  వెంట‌నే స్పందించి, ఆ […]

100నెంబ‌ర్‌కి ఫోన్ చేసి తండ్రిని కాపాడుకున్న చిన్నారి!
X

ప‌దేళ్ల పాప పోలీస్ స్టేష‌న్‌కి ఫోన్ త‌న తండ్రి ప్రాణాలు కాపాడుకున్న ఘ‌ట‌న కోల్‌క‌తాలో జ‌రిగింది. హెల్ప్‌లైన్ నెంబ‌ర్ 100కి వ‌చ్చిన ఓ కాల్‌ని రిసీవ్ చేసుకున్న పోలీసుల‌కు ఓ చిన్నారి గొంతు… మా నాన్న ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నాడు, కాపాడండి అంటూ ఏడుస్తూ వినిపించింది. అయితే పోలీసులు ముందు అదేదో ఆక‌తాయిల ప‌ని అనుకున్నారు. కానీ ఆపాప తన తండ్రి ఒంటికి నిప్పంటించుకున్నాడ‌ని, చెబుతూ ఏడుస్తుంటే దాన్ని ఫేక్ కాల్‌గా భావించి వ‌దిలేయ‌లేక‌పోయారు. వెంట‌నే స్పందించి, ఆ చిన్నారి చెబుతున్న అడ్ర‌స్ ప్రకారం వారి ఇంటికి వెళ్లారు. పోలీసులు అక్క‌డికి చేరేస‌రికి ఓ వ్య‌క్తి కిచెన్‌కి స‌మీపంలో 40 శాతం వ‌ర‌కు కాలిన గాయాలతో స్పృహ త‌ప్పి ఉన్నాడు. త‌మ‌కు ఫోన్ చేసిన చిన్నారి, ఆమె త‌ల్లి ఏడుస్తూ క‌నిపించారు. వెంట‌నే పోలీసులు కాలిన గాయాల‌తో ఉన్న వ్య‌క్తిని ద‌గ్గ‌ర‌లో ఉన్న‌ ఆర్‌జి కార్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కుటుంబ త‌గాదాల వ‌ల్ల‌నే అత‌ను ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించాడ‌ని పోలీసులు ప్రాథ‌మిక విచార‌ణ‌లో తెలుసుకున్నారు. స‌మ‌యానికి స‌రిగ్గా స్పందించి 100నెంబ‌ర్‌కి కాల్ చేసిన పాప స‌మ‌య‌స్ఫూర్తిని పోలీసులతో పాటు అంద‌రూ అభినందించారు.

ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించిన వ్య‌క్తి పేరు రాజీవ్ ఖ‌న్నా. వ్యాపారం చేస్తుంటాడు. అత‌ని కూతురు రాశి కోల్‌క‌తా ప‌బ్లిక్ స్కూల్లో చ‌దువుతోంది. కుటుంబ త‌గాదాల‌ వ‌ల్ల‌నే ఖ‌న్నా ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకున్నాడు. అయితే అత‌ను ఒంటిమీద కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుంటుంటే రాశికి ఏడ‌వ‌టం త‌ప్ప ఏం చేయాలో తెలియ‌లేదు. అప్పుడే ఆమెకు డ‌మ్‌డ‌మ్ మెట్రోస్టేష‌న్లో తాను చూసిన పోలీస్ ప్ర‌క‌ట‌న గుర్తొచ్చింది. అందులో ఉన్న 100 నెంబ‌రుకి ఫోన్ చేస్తే పోలీసులు వ‌చ్చి త‌న తండ్రిని కాపాడ‌తార‌నే న‌మ్మ‌కంతో ఆమె ఫోన్ చేసింది. ఆమె న‌మ్మ‌కం వృథా కాలేదు. అంత‌టి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లోనూ ఆ చిన్నారి మైండ్ చురుగ్గా ఆలోచించ‌డం, ప‌రిష్కారం వెతుక్కుని ప్ర‌య‌త్నించ‌డం అనేది నిజంగా ఆశ్చ‌ర్య‌క‌రమే. అయితే ఈ సంఘ‌ట‌న త‌రువాత మాత్రం ఆమె చాలా షాక్‌కి గుర‌యింద‌ని పాప త‌ల్లి తెలిపింది. చిన్నారిని త‌మ బంధువుల ఇంట్లో ఉంచిన‌ట్టుగా ఆమె చెప్పింది.

హెల్ప్‌లైన్ నెంబ‌రు 100, వారం క్రితం కూడా ఒక యువ‌తి ప్రాణాన్ని కాపాడింద‌ని తెలుస్తోంది. ఆత్మ‌హ‌త్యా ప్ర‌య‌త్నంలో ఓ 20 ఏళ్ల అమ్మాయి చేతి మ‌ణిక‌ట్టుని కోసుకుంది. త‌రువాత క్లీనింగ్ ద్ర‌వాన్ని తాగేసింది. ఆ త‌రువాత నొప్పి భ‌రించ‌లేక తానే 100 నెంబ‌ర్‌కి డ‌య‌ల్ చేసి స‌హాయం అర్థించింది. ఆమె త‌న అడ్ర‌స్ చెప్ప‌క‌పోయినా పోలీసులు జిపిఎస్ ద్వారా ఆమె ఎక్క‌డుందో తెలుసుకుని నిముషాల్లో అక్క‌డికి చేరుకుని ఆమెకు కాపాడారు.

First Published:  13 April 2016 2:00 AM GMT
Next Story