Telugu Global
Cinema & Entertainment

శ్రామికుల రోజున మహేష్ ఆడియో

మహేశ్ కొత్త సినిమా ఆడియో వేడుకపై సస్పెన్స్ వీడింది. శ్రామికుల దినోత్సవం మేడే నాడు… అంటే మే 1వ తేదీన బ్రహ్మోత్సవం సినిమా పాటల్ని విడుదల చేయాలని నిర్ణయించారు. వేదికను కూడా పక్కాగా ప్రకటించారు. తిరుపతిలోనే బ్రహ్మోత్సవం ఆడియో వేడుక ఉంటుందని తెలిపారు. నిజానికి ఈ సినిమా ఆడియోను ఈనెల 24న విడుదల చేస్తారని, వేడుక కూడా హైదరాబాద్ లోనే ఉంటుందని వార్తలు వచ్చాయి. అందులో కాస్త నిజం కూడా ఉంది. 24వ తేదీనే పాటలు విడుదల […]

శ్రామికుల రోజున మహేష్ ఆడియో
X
మహేశ్ కొత్త సినిమా ఆడియో వేడుకపై సస్పెన్స్ వీడింది. శ్రామికుల దినోత్సవం మేడే నాడు… అంటే మే 1వ తేదీన బ్రహ్మోత్సవం సినిమా పాటల్ని విడుదల చేయాలని నిర్ణయించారు. వేదికను కూడా పక్కాగా ప్రకటించారు. తిరుపతిలోనే బ్రహ్మోత్సవం ఆడియో వేడుక ఉంటుందని తెలిపారు. నిజానికి ఈ సినిమా ఆడియోను ఈనెల 24న విడుదల చేస్తారని, వేడుక కూడా హైదరాబాద్ లోనే ఉంటుందని వార్తలు వచ్చాయి. అందులో కాస్త నిజం కూడా ఉంది. 24వ తేదీనే పాటలు విడుదల చేద్దామనుకున్నారు. కానీ ప్రస్తుతం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల భారీ షెడ్యూల్ ప్లాన్ చేశాడు. సినిమా షూటింగ్ ను శరవేగంగా కొనసాగిస్తున్నాడు. ఇలాంటి టైమ్ లో ఆడియో ఫంక్షన్ పేరుచెప్పి…షెడ్యూల్ బ్రేక్ చేయడం ఇష్టంలేక పాటల వేడుకను వాయిదా వేసినట్టు తెలుస్తోంది. మహేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు పీవీపీ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు.
First Published:  13 April 2016 10:47 PM GMT
Next Story