రేష్మీని ఇలా ఊహించుకోగలమా ?

యాంకర్ రేష్మిని ఇప్పటి వరకు జబర్దస్త్ కామెడీ షోలో…. తర్వాత ‘గుంటూరు టాకీస్’ మూవీలో గ్లామరస్ లుక్ లో మాత్రమే చూసాం. ఈ నేపథ్యంలో ఆమె తర్వాతి సినిమా కూడా అలానే గ్లామరస్‌గా ఉంటుందని ఊహించుకోవడం సహజం. కానీ ‘చారుశీల’ అనే చిత్రంలో రేష్మి అందుకు భిన్నంగా కనిపించబోతోంది. భయపెట్టేవిధంగా రేష్మీ పాత్రను రూపొందించారని అంటున్నారు. సస్పెన్స్ థ్రిలర్ కు కామెడీ జోడించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వి.శ్రీనివాసరెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. జోత్స్న ఫిలిమ్స్ పతాకంపై ప్రముఖ దర్శకుడు వి.సాగర్, శిద్దిరెడ్డి జయశ్రీ అప్పారావు సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘చారుశీల’. బ్రహ్మానందం, రేష్మి, రాజీవ్ కనకాల, జశ్వంత్ ముఖ్య తారాగణం. జూపుడి సుమన్ ఈ సినిమాకి సంగీతం అందించారు.

ఈ సినిమా లోగో, ఫస్ట్ లుక్ ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల ఫిల్మ్ చాంబర్ లో జరిగింది. దర్శకులు భీమనేని శ్రీనివాసరావు టైటిల్ లోగో ఆవిష్కరించారు. జి.నాగేశ్వరరెడ్డి, ఎ.ఎస్.రవికుమార్ చౌదరిలు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ మ‌ధ్య గుంటూరు టాకీస్ చిత్రంతో అభిమానుల్ని మెప్పించిన రేష్మి కి ఆఫ‌ర్స్ బాగానే వ‌స్తున్నాయి. ఆఫ్ కోర్స్ గుంటూర్ టాకీస్ ఆశించినంత విజ‌యం సాధించ‌క పోయిన‌ప్ప‌టికి.. రేష్మి చిన్న బ‌డ్జెట్ చిత్రాల‌కు ఒక బెస్ట్ ఆప్ష‌న్ కావ‌డం విశేషం.