Telugu Global
Cinema & Entertainment

స‌మంత‌కు ` 24 `అయినా క‌ల‌సి వ‌స్తుందో లేదో...!

ఏ హీరోయినైనా స్టార్ కావాలని క‌ల‌లు కంటారు.  అయితే ఒక్క‌సారి స్టార్ డ‌మ్ వ‌చ్చిన త‌రువాత  దానిని నిల‌బెట్టుకోవ‌డం  పెద్ద చాలెంజ్.  స‌మంత‌కు టాలీవుడ్ లో చాలా త్వ‌ర‌గా   స్టార్ డ‌మ్ వ‌చ్చింది.    సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్టె చెట్టు వ‌ర‌కు   స‌మంత  జోరు బావుంది. ఆ త‌రువాత  ర‌కుల్ ప్రీతిసింగ్,  రాసిఖ‌న్నా   వెలుగులోకి రావ‌డంతో   స‌మంత‌కు  ఇక్క‌డ కొంత గ్యాప్ వ‌చ్చేసింది.  దానికి తోడు  ఎన్టీఆర్ తో ర‌భస‌, అదే స‌మ‌యంలో   సూర్య తో చేసిన సికింద‌ర్, […]

స‌మంత‌కు ` 24 `అయినా క‌ల‌సి వ‌స్తుందో లేదో...!
X

ఏ హీరోయినైనా స్టార్ కావాలని క‌ల‌లు కంటారు. అయితే ఒక్క‌సారి స్టార్ డ‌మ్ వ‌చ్చిన త‌రువాత దానిని నిల‌బెట్టుకోవ‌డం పెద్ద చాలెంజ్. స‌మంత‌కు టాలీవుడ్ లో చాలా త్వ‌ర‌గా స్టార్ డ‌మ్ వ‌చ్చింది. సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్టె చెట్టు వ‌ర‌కు స‌మంత జోరు బావుంది. ఆ త‌రువాత ర‌కుల్ ప్రీతిసింగ్, రాసిఖ‌న్నా వెలుగులోకి రావ‌డంతో స‌మంత‌కు ఇక్క‌డ కొంత గ్యాప్ వ‌చ్చేసింది. దానికి తోడు ఎన్టీఆర్ తో ర‌భస‌, అదే స‌మ‌యంలో సూర్య తో చేసిన సికింద‌ర్, అల్లుడు శీను ..ఈ చిత్రాలేవి పెద్ద‌గా క‌ల‌సి రాలేదు . అదే స‌మ‌యంలో రాసిఖ‌న్నా కు ఇక్క‌డ వ‌ర‌స గా రెండు మూడు హిట్స్ ప‌డ‌టంతో.. స్టార్ హీరోలంతా రాసిఖ‌న్నా ను త‌మ స‌ర‌స‌న హీరోయిన్ గా తీసుకోవ‌డానికి పోటి పడ్డారు.

క‌ట్ చే్స్తే ప్ర‌స్తుతం త‌మిళ‌, ఇటు తెలుగు లాంగ్వెజెస్ లో చిత్రాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తేరి చిత్రంలో విజ‌య్ స‌ర‌స‌న మొద‌టి సారి న‌టించింది. అదే విధంగా సూర్య తో 24 అంటూ మ‌రోసారి న‌టించింది. అయితే ప్ర‌స్తుతం విజ‌య్ స‌ర‌స‌న న‌టించిన పోలీస్ చిత్రం రిజ‌ల్ట్ తెలిసిపోయింది. ఈ నెల చివ‌రి వారంలో సూర్య తో విక్ర‌మ్ కుమార్ చేసిన 24 అనే సైన్స్ ఫిక్ష‌న్ చిత్రం విడుద‌ల అవుతుంది. ఈ చిత్రంతో అయిన స‌మంత‌కు హిట్ ప‌డుతుందో లేదో చూడాలి. ఎందుకంటే.. పోలీస్ సినిమా ఎలాగు స‌గ‌టు చిత్రంగా ఆడియ‌న్స్ తేల్చేశారు.

First Published:  16 April 2016 2:00 AM GMT
Next Story