Telugu Global
CRIME

ఇలాంటి ఈ మెయిల్స్‌కి  జ‌వాబు ఇవ్వ‌కండి!

సిరియా యుద్దం పేరు చెప్పి భార‌తీయుల‌కు వ‌ల‌వేస్తున్న నైజీరియ‌న్ల మోసాన్ని బ‌య‌ట‌పెట్టారు హైద‌రాబాద్ పోలీసులు. నేను సిరియా వాసిని నాకు స‌హాయం చేయండి అంటూ…  ఏమైనా ఈ మెయిల్స్ వ‌స్తే జాగ్ర‌త్త‌గా ఉండండి…స్పందించ‌కండి… అని పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు. అలా మోస‌పోయిన కుక‌ట్‌ప‌ల్లికి చెందిన చ‌ల‌గ‌ళ్ల శ్రీనివాస్ అనే రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి ఉదంతాన్ని సిటీ సైబ‌ర్ క్రైమ్ పోలీసులు వెల్ల‌డించారు. వీరు చెబుతున్న వివ‌రాల ప్ర‌కారం శ్రీనివాస్‌కి సిరియా నుండి 22 ఏళ్ల అమ్మాయి ఇమాన్ ముహ‌మ్మ‌ద్ […]

ఇలాంటి ఈ మెయిల్స్‌కి  జ‌వాబు ఇవ్వ‌కండి!
X

సిరియా యుద్దం పేరు చెప్పి భార‌తీయుల‌కు వ‌ల‌వేస్తున్న నైజీరియ‌న్ల మోసాన్ని బ‌య‌ట‌పెట్టారు హైద‌రాబాద్ పోలీసులు. నేను సిరియా వాసిని నాకు స‌హాయం చేయండి అంటూ… ఏమైనా ఈ మెయిల్స్ వ‌స్తే జాగ్ర‌త్త‌గా ఉండండి…స్పందించ‌కండి… అని పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు. అలా మోస‌పోయిన కుక‌ట్‌ప‌ల్లికి చెందిన చ‌ల‌గ‌ళ్ల శ్రీనివాస్ అనే రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి ఉదంతాన్ని సిటీ సైబ‌ర్ క్రైమ్ పోలీసులు వెల్ల‌డించారు. వీరు చెబుతున్న వివ‌రాల ప్ర‌కారం శ్రీనివాస్‌కి సిరియా నుండి 22 ఏళ్ల అమ్మాయి ఇమాన్ ముహ‌మ్మ‌ద్ పంపిన‌ట్టుగా ఒక ఈ మెయిల్ అందింది. అందులో సిరియాలో యుద్ధం కార‌ణంగా అనిశ్చిత ప‌రిస్థితి ఉంద‌ని, తాను హైద‌రాబాద్‌లో ఆస్తులు కొనాల‌నుకుంటున్నాన‌ని, అయితే సిరియా నుండి త‌న బంగారాన్ని ఇండియాకు త‌ర‌లించాలంటే క‌స్ట‌మ్స్ శాఖ‌కు డ‌బ్బు క‌ట్టాల్సి ఉంటుంద‌ని, ఈ విష‌యంలో త‌నకు స‌హాయం చేస్తే క‌మిష‌న్‌గా భారీ మొత్తం చెల్లిస్తాన‌ని…ఆ యువ‌తి కోరినట్టుగా ఉంది. అంతేకాదు, ఇలాంటి ఈ మెయిల్స్‌కి రిప్లయి ఇచ్చిన‌వారికి వంచ‌కులు, న‌కిలీ ఐడి కార్డులు, బంగారం ఉంద‌ని తెలిపే న‌కిలీ డాక్యుమెంట్లను కూడా పంపుతున్నారు. మ‌రో అడుగు ముందుకేసి, మ‌రింతగా న‌మ్మించ‌డానికి నిజంగానే స‌రుకు ఉన్న‌ట్టుగా చెబుతూ, క‌స్ట‌మ్ అధికారులుగా పేర్కొంటూ ఫోన్లు కూడా చేస్తున్నారు. శ్రీనివాస్ అలాగే మోస‌పోయి వారికి ఆరుల‌క్ష‌ల రూపాయ‌లు స‌మ‌ర్పించుకున్నాడు. ఇందులో సిరియ‌న్ల ప్ర‌మేయం ఏమీ ఉండ‌ద‌ని నైజీరియా మోస‌గాళ్లు ఇలా చేస్తున్నార‌ని, సిరియా నుండి పంపిన‌ట్టుగా అందుతున్న ఈ మెయిల్స్‌కి స్పందించ‌కండి…. అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

First Published:  18 April 2016 2:06 AM GMT
Next Story