స‌రైనోడు సినిమాకు  హైపు ప్ర‌మాదం కానుందా..?

ఏదైనా మితి మీరితే   ప్ర‌మాద‌మే.  పెద్ద బ‌డ్జెట్ చిత్రాల‌కు  సాధార‌ణంగానే హైపు ఎక్కువుగా వుంటుంది.  ఎందుకంటే  స్టార్ ఫ్యాక్ట‌ర్స్ ..కాంబినేష‌న్ ఫ్యాక్ట‌ర్స్  వుంటాయి.  అలాగే  స‌రైనోడు సినిమాకు  బ‌న్నీ.. బోయ‌పాటి, గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ స్టార్ ఫ్యాక్ట‌ర్సే. దీంతో సినిమా ఫ‌స్ట్ లుక్ రిలీజైన‌ప్ప‌టి నుంచి మెల్ల‌గా అంచ‌నాలు  ఏర్ప‌డుతూ వ‌చ్చాయి.  ఇక ఆడియో రిలీజ్ నాటికి మ‌రింత‌గా   అంచ‌నాలు పెరిగాయి.

క‌ట్ చేస్తే తాజా స‌మాచారం ప్ర‌కారం  ఈ సినిమాకు  మొద‌టి భాగంలోనే అంతా చూపించి.. సెకండాఫ్ ను డ‌ల్ చేశార‌నే టాక్ వినిపిస్తుంది. ఇది బ‌న్నీ ఫ్యాన్స్ కు ఒకింత  షాక్ చేసే అంశ‌మే.  మ‌రి ఇప్ప‌టికే సినిమా పై అంచ‌నాలు ఒక  రేంజ్ లో ఏర్ప‌డ్డాయి. ఆ త‌రుణంలో  సినిమాకు  సెకండాఫ్ డ‌ల్ గా ఉంటుంద‌నే అంశం  మైన‌సే అని చెప్పాలి.  మ‌రి అస‌లు స‌ర‌కు ఏమిటి  అని తెలియాలంటే  ఈ  నెల 22 వ‌ర‌కు  వెయిట్ చేయాల్సిందే మ‌రి.