Telugu Global
Cinema & Entertainment

విక్రమ్ విశ్వరూపం... అంతకు మించి....

చియాన్ విక్రమ్ హాఫ్ సెంచరీ కొట్టాడు. సినిమాల్లో కాదు… వయసులో. ఈ సీనియర్ హీరో రీసెంట్ గా 50ఏళ్లు కంప్లీట్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా తమిళనాడు చిత్ర పరిశ్రమకు చెందిన చాలామంది ప్రముఖులు విక్రమ్ కు శుభాకాంక్షలు తెలిపారు. మరికొంతమంది విక్రమ్ అభిమానులైతే… ఏకంగా తమ అభిమాన హీరోను సల్మాన్ ఖాన్ తో పోల్చడం మొదలుపెట్టారు. సరే… ఈ విషయాలు కాసేపు పక్కనపెడితే… తన హాఫ్ సెంచరీ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా టీజర్ విడుదల చేశాడు […]

విక్రమ్ విశ్వరూపం... అంతకు మించి....
X
చియాన్ విక్రమ్ హాఫ్ సెంచరీ కొట్టాడు. సినిమాల్లో కాదు… వయసులో. ఈ సీనియర్ హీరో రీసెంట్ గా 50ఏళ్లు కంప్లీట్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా తమిళనాడు చిత్ర పరిశ్రమకు చెందిన చాలామంది ప్రముఖులు విక్రమ్ కు శుభాకాంక్షలు తెలిపారు. మరికొంతమంది విక్రమ్ అభిమానులైతే… ఏకంగా తమ అభిమాన హీరోను సల్మాన్ ఖాన్ తో పోల్చడం మొదలుపెట్టారు. సరే… ఈ విషయాలు కాసేపు పక్కనపెడితే… తన హాఫ్ సెంచరీ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా టీజర్ విడుదల చేశాడు విక్రమ్. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగుతుంది. ఆ విషయాన్ని టీజర్ తో కన్ ఫర్మ్ చేశారు మేకర్స్. ఐ సినిమాతో ఇప్పటికే తన విశ్వరూపాన్ని ప్రదర్శించిన విక్రమ్…. తాజా సినిమాతో మరోసారి తనలోని మరో నటనా కోణాన్ని చూపాడు. మాస్క్ తొడుక్కున్న పాత్రలో అదరగొట్టాడు. నయనతార, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. 50ఏళ్లు పూర్తిచేసుకున్న విక్రమ్… కనీసం ఇరుముగమ్ అనే ఈ సినిమాతోనైనా హిట్ కొట్టాలని కోరుకుందాం.
First Published:  18 April 2016 3:37 AM GMT
Next Story