సెంచరీ సినిమా పని ప్రారంభించిన దేవి

బాలకృష్ణ చేయబోతున్న వందో సినిమాకు సంబంధించి సంగీత దర్శకత్వ బాధ్యతల్ని దేవిశ్రీప్రసాద్ కు అప్పగించారు. చారిత్రక నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా దేవిశ్రీకి ఓ సవాల్ లాంటిది. మరీ ముఖ్యంగా ఎక్కడా కాంప్రమైజ్ కాని క్రిష్ ను మెప్పించి ట్యూన్స్ అందించడం దేవిశ్రీకి కత్తిమీద సామే. అందుకే మొట్టమొదట ఈ సినిమా పనినే ప్రారంభించాడు దేవి. సినిమా సంగీతానికి సంబంధించి ఇప్పటికే దేవీకి కొన్ని సూచనలు చేశాడు క్రిష్. అలనాటి నర్తనశాల, శ్రీకృష్ణతులాభారం, మాయాబజార్ లాంటి సినిమాల్లో ఎలాంటి సంగీతం వినిపించిందో… ఆ శైలిలో మ్యూజిక్ కంపోజ్ చేస్తూనే… దేవి మార్క్ కనిపించేలా ట్యూన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశాడట. నిజానికి సంగీతం అంతా ఎలక్ట్రానిక్స్ తో నిండిపోయిన ఈ రోజుల్లో…. సంప్రదాయ వాయిద్యాలతో వీనులవిందైన సంగీతాన్ని సృష్టించడం కష్టమైన పనే. ఎందుకంటే… సంప్రదాయ వాయిద్యాలతో సంగీతం పుట్టించినప్పుడు… రికార్డింగ్ స్టుడియోలో జిమ్మిక్కులు చేయడానికి కుదరదు. ఉన్నది ఉన్నట్టు ప్రొడ్యూస్ చేయాలి. మెలొడీకి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రస్తుతం దేవిశ్రీ అదే పనిలో ఉన్నాడు.