Telugu Global
Cinema & Entertainment

మిగిలిన వాళ్లను కూడా చుట్టేస్తున్న కాజల్

కాజల్ ఇప్పటికే టాలీవుడ్ లో ఓ రౌండ్ కొట్టేసింది. రామ్, నాగచైతన్య లాంటి కుర్రహీరోల నుంచి మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ల వరకు అందర్నీ ఓ చూపు చూసేసింది. ఆ మధ్య కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ… తాజాగా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో టాలీవుడ్ లో సెకెండ్ రౌండ్ చుట్టేసే కార్యక్రమం మొదలుపెట్టింది. ఇప్పటివరకు తన నటించన హీరోల లిస్ట్ తయారుచేసి, వాళ్లందరితో సినిమాలు సిద్ధం చేస్తోంది. ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న […]

మిగిలిన వాళ్లను కూడా చుట్టేస్తున్న కాజల్
X
కాజల్ ఇప్పటికే టాలీవుడ్ లో ఓ రౌండ్ కొట్టేసింది. రామ్, నాగచైతన్య లాంటి కుర్రహీరోల నుంచి మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ల వరకు అందర్నీ ఓ చూపు చూసేసింది. ఆ మధ్య కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ… తాజాగా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో టాలీవుడ్ లో సెకెండ్ రౌండ్ చుట్టేసే కార్యక్రమం మొదలుపెట్టింది. ఇప్పటివరకు తన నటించన హీరోల లిస్ట్ తయారుచేసి, వాళ్లందరితో సినిమాలు సిద్ధం చేస్తోంది. ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న పవన్ కల్యాణ్ సినిమాను పూర్తిచేసిన కాజల్… తాజాగా బాలయ్యను టార్గెట్ చేసింది. బాలయ్య త్వరలోనే చేయబోతున్న వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణిలో కాజల్ నే హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే మగధీర, సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి సినిమాల్లో రాజకుమారి పాత్రలు పోషించిన కాజల్ ను… శాతకర్ణి సినిమాలో తీసుకుంటే బాగా హెల్ప్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. సో.. అన్నీ అనుకున్నట్టు జరిగితే బాలయ్య సరసన తొలిసారి కాజల్ కనిపించనుంది. ఇలా సెకెండ్ ఇన్నింగ్స్ లో పవన్, బాలయ్య లాంటి హీరోల్ని కవర్ చేస్తున్న కాజల్… తాజాగా తన లిస్ట్ లోకి రానాను కూడా చేర్తింది. ఇలా మరింత మంది కొత్తనటీనటులతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని భావిస్తోంది.
First Published:  19 April 2016 12:00 AM GMT
Next Story