Telugu Global
Cinema & Entertainment

నితిన్ సినిమాకు దారేది...?

ఈనెల నితిన్ సినిమా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే థియేటర్లన్నింటినీ సరైనోడు కబ్జా చేశాడు. నిజానికి మే నెలలోనే సినిమాను రిలీజ్ చేస్తామని నితిన్ మొదట్నుంచి చెబుతూ వస్తున్నాడు. కానీ మే నెలలో కూడా నితిన్ సినిమా వెలుగులోకి వచ్చేది అనుమానంగానే కనిపిస్తోంది. ఎందుకంటే…. మే 6న సూర్య నటించిన 24 సినిమాతో పాటు… సాయిధర్మతేజ నటించిన సుప్రీమ్ సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ఆ తర్వాత వారం, 10 రోజులకే మహేష్ నటించిన బ్రహ్మోత్సవం సినిమాను విడుదల […]

నితిన్ సినిమాకు దారేది...?
X
ఈనెల నితిన్ సినిమా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే థియేటర్లన్నింటినీ సరైనోడు కబ్జా చేశాడు. నిజానికి మే నెలలోనే సినిమాను రిలీజ్ చేస్తామని నితిన్ మొదట్నుంచి చెబుతూ వస్తున్నాడు. కానీ మే నెలలో కూడా నితిన్ సినిమా వెలుగులోకి వచ్చేది అనుమానంగానే కనిపిస్తోంది. ఎందుకంటే…. మే 6న సూర్య నటించిన 24 సినిమాతో పాటు… సాయిధర్మతేజ నటించిన సుప్రీమ్ సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ఆ తర్వాత వారం, 10 రోజులకే మహేష్ నటించిన బ్రహ్మోత్సవం సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సో…. మహేష్ నటించిన బ్రహ్మోత్సవం సినిమాకు పోటీగా నితిన్ సినిమాను విడుదల చేసే అవకాశం లేదు. మధ్యలో రాజా చేయి వేస్తే, శశికళ, కబాలి లాంటి సినిమాలు ఉండనే ఉన్నాయి. సో… నితిన్ నటించిన అ..ఆ సినిమాను జూన్ లోనే విడుదల చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే జూన్ లో వెంకటేష్ నటించిన బాబు బంగారం సినిమా విడుదలకానుంది. ఈ సినిమాతో క్లాష్ కాకుండా అ..ఆను థియేటర్లలోకి దించాలని అనుకుంటున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అ..ఆ సినిమాలో నితిన్-సమంత హీరోహీరోయిన్లుగా నటించారు. మిక్కీ జే మేయర్ పాటలు సమకూర్చాడు.
First Published:  19 April 2016 12:02 AM GMT
Next Story