Telugu Global
National

12 ఏళ్ల పాప‌...నీళ్లు మోస్తూ ప్రాణాలు వ‌దిలింది!

అత్యంత హృద‌య విదార‌క‌మైన సంఘ‌ట‌న ఇది. మహారాష్ట్ర‌లో నీటి క‌రువుకి ఓ చిన్నారి బ‌లైపోయింది.   కుటుంబంతో పాటు మండుటెండ‌లో నీళ్లు మోసిన  12 ఏళ్ల బాలిక వ‌డ‌దెబ్బ‌కు గురై గుండెపోటుతో  ప్రాణాలు కోల్పోయింది. బీడ్ జిల్లా, స‌బ‌ల్‌ఖెడ్ గ్రామానికి చెందిన ఆ పాప పేరు యోగితా అశోక్ దేశాయి. త‌మ ఇంటికి అర‌కిలోమీట‌రు దూరంలో ఉన్నచేతి పంపునుండి నీటిని తెస్తూ చాలాస‌మయం ఎండ‌లో తిర‌గ‌టంతో  ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోయింది. స్పృహ కోల్పోయిన యోగిత‌ని కుటుంబ స‌భ్యులు ఆసుప‌త్రికి తీసుకువెళ్ల‌గా […]

12 ఏళ్ల పాప‌...నీళ్లు మోస్తూ ప్రాణాలు వ‌దిలింది!
X

అత్యంత హృద‌య విదార‌క‌మైన సంఘ‌ట‌న ఇది. మహారాష్ట్ర‌లో నీటి క‌రువుకి ఓ చిన్నారి బ‌లైపోయింది. కుటుంబంతో పాటు మండుటెండ‌లో నీళ్లు మోసిన 12 ఏళ్ల బాలిక వ‌డ‌దెబ్బ‌కు గురై గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. బీడ్ జిల్లా, స‌బ‌ల్‌ఖెడ్ గ్రామానికి చెందిన ఆ పాప పేరు యోగితా అశోక్ దేశాయి. త‌మ ఇంటికి అర‌కిలోమీట‌రు దూరంలో ఉన్నచేతి పంపునుండి నీటిని తెస్తూ చాలాస‌మయం ఎండ‌లో తిర‌గ‌టంతో ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోయింది. స్పృహ కోల్పోయిన యోగిత‌ని కుటుంబ స‌భ్యులు ఆసుప‌త్రికి తీసుకువెళ్ల‌గా వైద్యులు ఆమె మ‌ర‌ణించింద‌ని చెప్పారు.

బాలికకు వ‌డ‌దెబ్బ త‌గ‌ల‌టం వ‌ల‌న గుండెపోటు వ‌చ్చింద‌ని వైద్యులు తెలిపారు. సెల‌వులు కావ‌డంతో ఇంట్లో ఉంటున్న యోగిత నీళ్లు తేవ‌డంలో త‌ల్లిదండ్రుల‌కు స‌హాయం చేస్తూ ప్రాణాల‌నే కోల్పోయింది. మ‌హారాష్ట్ర‌లో ముఖ్యంగా మ‌ర‌ట్వాడా ప్రాంతంలో నీటి క‌రువు చాలా ఎక్కువ‌గా ఉంది. ఇక్క‌డి డ్యాముల్లో 3శాతం నీరుమాత్ర‌మే ఉంది. దేశంలో ప‌ది రాష్ట్రాల‌లో 33కోట్ల‌మంది క‌రువుబారిన ప‌డ్డార‌ని ప్ర‌భుత్వ లెక్క‌లు చెబుతున్నాయి.

First Published:  20 April 2016 2:04 AM GMT
Next Story