Telugu Global
Cinema & Entertainment

రానాను చుట్టుకున్న బాహుబలి

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో ఎవరికీ తెలియదు. కానీ బాలీవుడ్ నిర్మాతలు మాత్రం రానాను పట్టుకుని చంపేస్తున్నారు. బాహుబలి-2 రైట్స్ తమకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. నిజానికి ఇలాంటివి మాట్లాడుకోవడానికి నిర్మాతలు ఉన్నారు. కానీ బాలీవుడ్ జనాలకు రానా మాత్రమే పరిచయం. రానా కాంటాక్ట్ మాత్రమే వాళ్ల వద్ద ఉంది. మరీ ముఖ్యంగా బాహుబలి పార్ట్-1కు సంబంధించి డీలింగ్ మొత్తం రానానే చేశాడు. కరణ్ జోహార్ తో మాట్లాడి దగ్గరుండి డీల్  సెట్ చేశాడు. అది పెద్ద హిట్టవ్వడంతో… […]

రానాను చుట్టుకున్న బాహుబలి
X
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో ఎవరికీ తెలియదు. కానీ బాలీవుడ్ నిర్మాతలు మాత్రం రానాను పట్టుకుని చంపేస్తున్నారు. బాహుబలి-2 రైట్స్ తమకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. నిజానికి ఇలాంటివి మాట్లాడుకోవడానికి నిర్మాతలు ఉన్నారు. కానీ బాలీవుడ్ జనాలకు రానా మాత్రమే పరిచయం. రానా కాంటాక్ట్ మాత్రమే వాళ్ల వద్ద ఉంది. మరీ ముఖ్యంగా బాహుబలి పార్ట్-1కు సంబంధించి డీలింగ్ మొత్తం రానానే చేశాడు. కరణ్ జోహార్ తో మాట్లాడి దగ్గరుండి డీల్ సెట్ చేశాడు. అది పెద్ద హిట్టవ్వడంతో… ఇప్పుడు బాలీవుడ్ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు రానా వెంట పడ్డారు. బాహుబలి-2 రైట్స్ ఇప్పించమని అడుగుతున్నారు. కేవలం వీళ్లే కాదు… శాటిలైట్ రైట్స్ ఇప్పించమంటూ హిందీ ఎంటర్ టైన్ మెంట్ ఛానెళ్ల వాళ్లు కూడా రానా వెంట పడుతున్నారు. వద్దన్నా ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. మొదట్లో మొహమాటానికి పోయి రెండు-మూడు కాల్స్ ను వ్యక్తిగతంగా ట్రీట్ చేసిన రానా… ప్రస్తుతం మాత్రం ఎవరు తనకు ఫోన్ చేసినా నిర్మాతల నంబర్లు ఇచ్చి మాట్లాడుకోమంటున్నాడు,.
First Published:  19 April 2016 10:53 PM GMT
Next Story