Telugu Global
Cinema & Entertainment

రెండు రోజుల ట్రెండింగ్ బాలయ్యే

ఈమధ్య వరుసగా 2 రోజులు సోషల్ నెట్ వర్కింగ్ లో బాలయ్యే ట్రెండ్ అయి కూర్చున్నాడు. ఎవరైనా ట్రెండింగ్ అయితే గొప్పగా చెప్పుకుంటారు. కానీ బాలకృష్ణ మాత్రం ఘనంగా చెప్పుకోలేని పరిస్థితి. అవును మరి అది అలాంటిలాంటి ట్రెండింగ్ కాదు… స్మోకింగ్ ట్రెండింగ్. అవును… చెన్నైలో నడిగర్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన క్రికెట్ మ్యాచుకు బాలయ్య వెళ్లాడు. ఉక్కపోత ఎక్కువగా ఉందేమో… చొక్కా విప్పేశాడు. బనియన్ తో ఫ్యాన్ దగ్గర కూర్చున్నాడు. అదే పెద్ద ట్రెండింగ్ అనుకున్న […]

రెండు రోజుల ట్రెండింగ్ బాలయ్యే
X
ఈమధ్య వరుసగా 2 రోజులు సోషల్ నెట్ వర్కింగ్ లో బాలయ్యే ట్రెండ్ అయి కూర్చున్నాడు. ఎవరైనా ట్రెండింగ్ అయితే గొప్పగా చెప్పుకుంటారు. కానీ బాలకృష్ణ మాత్రం ఘనంగా చెప్పుకోలేని పరిస్థితి. అవును మరి అది అలాంటిలాంటి ట్రెండింగ్ కాదు… స్మోకింగ్ ట్రెండింగ్. అవును… చెన్నైలో నడిగర్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన క్రికెట్ మ్యాచుకు బాలయ్య వెళ్లాడు. ఉక్కపోత ఎక్కువగా ఉందేమో… చొక్కా విప్పేశాడు. బనియన్ తో ఫ్యాన్ దగ్గర కూర్చున్నాడు. అదే పెద్ద ట్రెండింగ్ అనుకున్న టైమ్ లో… ఏకంగా సిగరెట్ అందుకున్నాడు. చుట్టుపక్కల పెద్దపెద్ద హీరోలు, సున్నితమైన హీరోయిన్లు ఉన్నారని కూడా చూడకుండా వెలిగించాడు. అది అయిపోయే దాకా గుప్పుగుప్పుమని పని కానిస్తూనే ఉన్నాడు. బనియన్ లో బాలయ్య… చేతిలో సిగరెట్టు… ఇదే క్యాప్షన్ తో నెట్ లో ట్రెెండింగ్ షురూ అయింది. అయితే దీనికి ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువ వచ్చాయి. దీంతో బాలయ్య సంగతి అటుంచి ఫ్యాన్స్ కూడా చల్లగా ఆ టాపిక్ ను సైడ్ చేశారు.
First Published:  19 April 2016 10:47 PM GMT
Next Story