Telugu Global
Cinema & Entertainment

బోయ‌పాటి  వెన‌క్కు త‌గ్గాడా..?

టాలీవుడ్లో యాక్షన్ సినిమాల దర్శకుడిగా పేరొందిన బోయపాటి….ఇంతకు ముందు సింహా, దమ్ము, లెజెండ్ లాంటి భారీ యాక్షన్ చిత్రాలను తెరకెక్కించాడు. బోయపాటి సినిమాలంటేనే రక్తం ఏరులై పారుతుంది, తీవ్రమైన హింస కూడా ఉందనే పేరుంది. ఆయన గత చిత్రాలకు ఎక్కువగా ‘A’ సర్టిఫికెట్ రావడమే ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం బోయపాటి ‘సరైనోడు’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ నెల 22న విడుదలవుతున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. బోయపాటి దర్శకత్వం కాబట్టి ఈ చిత్రానికి […]

బోయ‌పాటి  వెన‌క్కు త‌గ్గాడా..?
X

టాలీవుడ్లో యాక్షన్ సినిమాల దర్శకుడిగా పేరొందిన బోయపాటి….ఇంతకు ముందు సింహా, దమ్ము, లెజెండ్ లాంటి భారీ యాక్షన్ చిత్రాలను తెరకెక్కించాడు. బోయపాటి సినిమాలంటేనే రక్తం ఏరులై పారుతుంది, తీవ్రమైన హింస కూడా ఉందనే పేరుంది. ఆయన గత చిత్రాలకు ఎక్కువగా ‘A’ సర్టిఫికెట్ రావడమే ఇందుకు నిదర్శనం.

ప్రస్తుతం బోయపాటి ‘సరైనోడు’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ నెల 22న విడుదలవుతున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. బోయపాటి దర్శకత్వం కాబట్టి ఈ చిత్రానికి కూడా A సర్టిఫికెటే వస్తుందని అంతా భావించారు. కానీ సెన్సార్ నుండి ఈ చిత్రం U/A సర్టిఫికెట్ పొందింది. దీన్ని బట్టి ఈ సినిమాలో బోయపాటి రక్తపాతం, హింస విషయంలో కాస్త తగ్గాడని స్పష్టమవుతోంది.

First Published:  19 April 2016 10:30 PM GMT
Next Story