మగతనంపై నాయకుల కామెంట్స్

సాధారణంగా రాజకీయంగా ఒక పార్టీ నుంచి మహిళ ప్రతినిధి విమర్శలు చేస్తే అవతలి పార్టీ నుంచి కూడా మహిళ నుంచే ఘాటైన రియాక్షన్ వస్తుంటుంది. కానీ ఏపీలో మాత్రం అలాంటి హద్దులేమీ ఉన్నట్టుగా అనిపించడం లేదు. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా అంటే చాలు టీడీపీకి చెందిన పురుష ప్రజాప్రతినిధులు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. టీడీపీలో మగాళ్లు లేకనే వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొని తీసుకెళ్తున్నారంటూ రోజా చేసిన కామెంట్స్ ఇప్పుడు రచ్చకు  కారణమయ్యాయి. రోజా కూడా ఇలా మాట్లాడం సరికాదు. అయితే  రోజా మాటలకు అంతకంటే దారుణంగా టీడీపీ నేతలు వ్యాఖ్యలతో కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేతలు గాలి ముద్దుకృష్ణమ,  బోండా ఉమా.

టీడీపీలో మగాళ్లు లేరని రోజా అంటున్నారని ఆమె ఏమైనా మగతనం టెస్టింగ్ చేసే ఏజెన్సీ పెట్టారా అని ముద్దుకృష్ణమ కామెంట్స్ చేశారు.   వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీ కొంటోందంటున్న జగన్ … ముందు రోజాను ఎంతకు కొన్నారో చెప్పాలని ఇద్దరు నేతలు డిమాండ్ చేశారు. వైసీపీలో మగ ఎమ్మెల్యేలను రోజా వేధిస్తోందని ఒక విధంగా రాజకీయ నాయకులంటేనే చీ అనిపించేలా వ్యాఖ్యలు చేశారు. అటు రోజా కూడా మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటే రాజకీయ నాయకులపై మిగిలిన గౌరవమైనా నిలబడుతుంది.

Click on Image to Read:

nellore-leader

pub-disco

ysjagan-cbi-case

acp

babu-birthday

sakshi

roja-bonda1

Vijayamma birthday

balineni-srinivasa-reddy

lokesh

kodali-nani-comments

heritate

janke venkata reddy

narayana

cbn-narayana

mla-jaleel-khan