Telugu Global
NEWS

కృపాల్‌సింగ్ శ‌రీరంలోనూ ప్ర‌ధాన అవ‌య‌వాలు లేవు!

పాకిస్తాన్, కోట్ ల‌ఖ‌ప‌త్ జైల్లో   ఈ నెల 11న అనుమానాస్ప‌ద స్థితిలో మ‌ర‌ణించిన కృపాల్ సింగ్ మృత‌దేహంలో ప్ర‌ధాన అవ‌య‌వాలు లేవ‌ని పోస్ట్‌మార్ట‌మ్ రిపోర్టులో తేలింది. గుండె, లివ‌ర్ లాంటి ప్ర‌ధాన అవ‌య‌వాలు లేవ‌ని వైద్యులు త‌మ‌ రిపోర్టులో తెలిపారు.  అదే జైల్లో నిర్బంధంలో ఉండి 2013లో మ‌ర‌ణించిన స‌ర‌బ్‌జిత్ సింగ్ మృత‌దేహంలోనూ ఇలాగే ప్ర‌ధాన అవ‌య‌వాలు లేక‌పోవ‌టం తెలిసిన విష‌యమే. శ‌వప‌రీక్ష ద్వారా మ‌ర‌ణానికి కార‌ణం తెలుసుకునేందుకు అవ‌సర‌మైన  అత్యంత ముఖ్య‌మైన అవ‌య‌వాలు మృత‌దేహంలో లేవ‌ని […]

కృపాల్‌సింగ్ శ‌రీరంలోనూ ప్ర‌ధాన అవ‌య‌వాలు లేవు!
X

పాకిస్తాన్, కోట్ ల‌ఖ‌ప‌త్ జైల్లో ఈ నెల 11న అనుమానాస్ప‌ద స్థితిలో మ‌ర‌ణించిన కృపాల్ సింగ్ మృత‌దేహంలో ప్ర‌ధాన అవ‌య‌వాలు లేవ‌ని పోస్ట్‌మార్ట‌మ్ రిపోర్టులో తేలింది. గుండె, లివ‌ర్ లాంటి ప్ర‌ధాన అవ‌య‌వాలు లేవ‌ని వైద్యులు త‌మ‌ రిపోర్టులో తెలిపారు. అదే జైల్లో నిర్బంధంలో ఉండి 2013లో మ‌ర‌ణించిన స‌ర‌బ్‌జిత్ సింగ్ మృత‌దేహంలోనూ ఇలాగే ప్ర‌ధాన అవ‌య‌వాలు లేక‌పోవ‌టం తెలిసిన విష‌యమే.

శ‌వప‌రీక్ష ద్వారా మ‌ర‌ణానికి కార‌ణం తెలుసుకునేందుకు అవ‌సర‌మైన అత్యంత ముఖ్య‌మైన అవ‌య‌వాలు మృత‌దేహంలో లేవ‌ని అప్ప‌ట్లో స‌ర‌బ్‌జిత్ సింగ్ విష‌యంలోనూ డాక్ట‌ర్లు వెల్ల‌డించారు. పాక్ అధికారులు కృపాల్‌సింగ్ హార్ట్ ఎటాక్‌తో మ‌ర‌ణించిన‌ట్టుగా చెబుతుండగా, శ‌వ‌ప‌రీక్ష‌కు అవ‌స‌ర‌మైన ముఖ్య‌మైన అవ‌య‌వాలే లోపించాయి. కృపాల్‌సింగ్‌ని జైల్లో హింసించి చంపార‌ని, స‌ర‌బ్‌జిత్‌పై దాడి నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌నే భ‌యంతోనే కృపాల్‌ని చంపేశార‌ని ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్నారు. కృపాల్‌సింగ్ పోస్ట్‌మార్ట‌మ్ అనంత‌రం స్పందించిన వైద్యులు అవ‌య‌వ‌దానం చేస్తే త‌ప్ప అలా అవ‌య‌వాల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ తొల‌గించ‌ర‌ని చెబుతుండ‌గా, మ‌రికొంత‌మంది పాక్‌లో ఉన్న వైద్య విధానాల ప్ర‌కారం ప్ర‌ధాన అవ‌య‌వాల‌ను ప‌రీక్ష‌ల నిమిత్తం భ‌ద్ర‌ప‌రుస్తార‌ని అంటున్నారు. కృపాల్ సింగ్ శ‌రీరంమీద తీవ్ర‌మైన గాయాల గుర్తులున్నాయ‌ని. ఆయ‌న గుండెపోటుతో మ‌ర‌ణించ‌లేద‌ని, కృపాల్ సింగ్ స‌న్నిహిత బంధువు అశ్విని కుమార్ వెల్ల‌డించాడు.

మన సైనిక దళాలలో ఎనిమిదేళ్లు పనిచేసి రిటైర్ అయిన కృపాల్ సింగ్‌ను 1992లో పాకిస్తాన్ సైనికులు అపహరించుకొని పోయారు. ఆ తరువాత ఆయనపై పేలుడు ప‌దార్థాల‌తో పాక్‌లోకి చొర‌బ‌డ్డాడ‌ని, గూఢ‌చ‌ర్యం చేస్తున్నాడ‌నే అభియోగాలు మోపారు. త‌రువాత లాహోర్ కోర్టు పేలుడు ప‌దార్థాల అభియోగం నిజంకాద‌ని కొట్టివేసింది. కానీ గూఢ‌చ‌ర్యం కేసులో కృపాల్ సింగ్‌కి ఉరిశిక్ష‌ని విధించింది.

First Published:  20 April 2016 2:00 AM GMT
Next Story