కృష్ణ‌వంశీ  క‌లిశాడు.. హీరో ఒకే చెప్పాడు..!

క్రియేటివ్ డైరెక్ట‌ర్స్ లో  కృష్ణ‌వంశీ ఒక‌రు.  ఆయ‌న సినిమా అంటే  ఒక‌ప్పుడు ఫిల్మ్ ల‌వ‌ర్స్ కు ఒక  ప్రామిసింగ్ ఫిల్మ్ అనే న‌మ్మ‌కం ఉండేది. కాల క్ర‌మంలో  ఆ న‌మ్మ‌కం  స‌డలింది.   క‌ట్ చేస్తే.. ఇప్ప‌టి జ‌న‌రేష‌న్ యంగ్  హీరోల్ని క‌థ‌ల‌తో ఒప్పించ‌డం కూడా పెద్ద చాలెంజే.   అలా  ఒక చాలెంజ్ ను  కృష్ణ‌వంశీ  నెగ్గిన‌ట్లే.  యువ హీరో సందీప్ కిష‌న్ కు  త‌ను లాంగ్ బ్యాగ్ రాసుకున్న ఒక క‌థ‌ను చెప్పి ఒప్పించార‌ట‌. చాల రియ‌లిస్టిక్ స్టోరిగా ఉన్న ఈ చిత్ర క‌థ‌ను   ఈ మ‌ధ్య  కృష్ణ‌వంశీ  యువ  హీరో సందీప్ కు వినిపించార‌ట‌. స్టోరి విన్న వెంట‌నే  సందీప్ కిష‌న్ డేట్స్ ఇచ్చేశాడ‌ట‌.    ఊహించ‌ని ట్విస్ట్ ల‌తో  ఆడియ‌న్స్ ను ప్ర‌తి క్ష‌ణం థ్రిల్ల్ చేసేలా చిత్రం ఉంటుంద‌ట‌. మ‌రి  ఈ చిత్రం ఎప్పుడు సెట్స్ మీద‌కు వెళ్తుంది అనేది  తెలియాలంటే కొద్ది రోజులు  వెయిట్ చేయాల్సిందే.