Telugu Global
Others

పాలేరుపై తుమ్మ‌ల త‌న‌యుని ఆస‌క్తి!

ఖ‌మ్మం జిల్లా పాలేరు నియోజ‌క‌వ‌ర్గానికి ఎన్నిక‌ల న‌గారా మోగింది. మే నెల 16 తేదీన  పోలింగ్ జ‌ర‌గ‌నుంది. 19న ఫ‌లితాలు కూడా వెల్ల‌డ‌వుతాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌తంలో దివంగ‌త ఎమ్మెల్యే రాంరెడ్డి వెంక‌ట‌రెడ్డి ప్రాతినిధ్యం వ‌హించారు. ఆయ‌న హ‌ఠాన్మ‌ర‌ణంతో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఉప ఎన్నిక అనివార్య‌మైంది. ఈ స్థానంలో ఇంత‌వ‌ర‌కూ పోటీకి నిల‌ప‌వ‌ద్ద‌ని ఇత‌ర పార్టీల‌కు కాంగ్రెస్ ఎలాంటి విన‌తులు చేసింది లేదు. అయితే, నారాయ‌ణఖేడ్ ఉప ఎన్నిక స‌మ‌యంలో మ‌ర‌ణించిన ఎమ్మెల్యే కిష్టారెడ్డి కుటుంబ […]

పాలేరుపై తుమ్మ‌ల త‌న‌యుని ఆస‌క్తి!
X
ఖ‌మ్మం జిల్లా పాలేరు నియోజ‌క‌వ‌ర్గానికి ఎన్నిక‌ల న‌గారా మోగింది. మే నెల 16 తేదీన పోలింగ్ జ‌ర‌గ‌నుంది. 19న ఫ‌లితాలు కూడా వెల్ల‌డ‌వుతాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌తంలో దివంగ‌త ఎమ్మెల్యే రాంరెడ్డి వెంక‌ట‌రెడ్డి ప్రాతినిధ్యం వ‌హించారు. ఆయ‌న హ‌ఠాన్మ‌ర‌ణంతో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఉప ఎన్నిక అనివార్య‌మైంది. ఈ స్థానంలో ఇంత‌వ‌ర‌కూ పోటీకి నిల‌ప‌వ‌ద్ద‌ని ఇత‌ర పార్టీల‌కు కాంగ్రెస్ ఎలాంటి విన‌తులు చేసింది లేదు. అయితే, నారాయ‌ణఖేడ్ ఉప ఎన్నిక స‌మ‌యంలో మ‌ర‌ణించిన ఎమ్మెల్యే కిష్టారెడ్డి కుటుంబ స‌భ్యులను నిల‌బెట్టి ఏక‌గ్రీవం చేద్దామ‌న్న జానారెడ్డి ప్ర‌తిపాద‌న‌కు సీఎం కేసీఆర్ సుముఖ‌త వ్య‌క్తం చేశారు… కానీ టీడీపీతో క‌లిసి బంద్ కు పిలుపునివ్వ‌డంతో త‌న నిర్ణ‌యాన్ని మార్చుకున్నారు. ప్ర‌తిప‌క్షాల‌పై పోటీ చేసి ఆ సెగ్మెంట్‌ను గులాబీ ఖాతాలో వేసుకున్నారు. ఈ లెక్క‌న పాలేరు కూడా త‌మ ఖాతాలో వేసుకునేందుకే గులాబీ పార్టీ ఆస‌క్తిగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.
నాన్న ఆదేశిస్తే.. పోటీ: యుగంధ‌ర్‌
ఖ‌మ్మం జిల్లా మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు త‌న‌యుడు యుగంధ‌ర్ పాలేరుపై ఆస‌క్తిగా ఉన్నాడు. త‌న తండ్రి ఆదేశిస్తే.. పోటీ చేసేందుకు సిద్ధ‌మేన‌ని చేసిన బ‌హిరంగ ప్ర‌క‌ట‌నే ఇందుకు నిద‌ర్శ‌నం. పైగా త‌న తండ్రికి ఉన్న ప‌లుకుబ‌డి, కేడ‌ర్‌, అధికార పార్టీ కావ‌డం ఇవ‌న్నీ కూడా యుగంధ‌ర్‌కు క‌లిసివ‌చ్చే అంశాలే! పైగా తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు కేసీఆర్‌కు ఆప్త‌మిత్రుడు. ఇన్ని అనుకూల అంశాలు ఉన్నాయి కాబట్టే యుగంధ‌ర్ త‌న మ‌న‌సులో మాట‌ను బాహాటంగా చెప్ప‌గ‌లిగాడు. ఇప్ప‌టికే త‌న త‌న‌యుడికి ఈ టికెట్ విష‌య‌మై పార్టీ తుమ్మ‌ల‌కు ఏదైనా హామీ ఇచ్చిందా అన్న చ‌ర్చ గులాబీపార్టీలో మొద‌లైంది. లేదంటే త‌న త‌న‌యుడు పోటీలో ఉన్నాడ‌న్న సంగ‌తిని, వ్యూహాత్మ‌కంగా తుమ్మ‌లే చెప్పించాడా? అన్న అనుమానాలు లేక‌పోలేదు. చూద్దాం పాలేరు టికెట్ ఎవ‌రిని వ‌రిస్తుందో?
First Published:  20 April 2016 3:06 AM GMT
Next Story