Telugu Global
Cinema & Entertainment

మెగా హీరోకు నందమూరి సినిమా చూపించాడు...

అల్లు అర్జున్ తో బోయపాటి శ్రీను సినిమా చేస్తున్నాడనే వార్త బయటకు రాగానే మెగా ఫ్యాన్స్ అనుమానించారు. బన్నీని బోయపాటి మార్చగలడా… లేక బోయపాటి స్టయిల్ లోకి బన్నీ వెళ్లిపోతాడా అనే బెట్టింగ్ లు కూడా నడిచాయి. ఫైనల్ గా మెగాభిమానులు బయపడినట్టే జరిగింది. బన్నీకి నందమూరి సినిమా చూపించాడట బోయపాటి. అంటే మెగా స్టయిల్ లో కాకుండా… బాలకృష్ణతో సినిమాలు చేసిన అనుభవాన్ని సరైనోడు సినిమాలో చూపించాడట. మూవీ మొత్తం బాలయ్య సినిమా చూసిన ఫీలింగ్ […]

మెగా హీరోకు నందమూరి సినిమా చూపించాడు...
X
అల్లు అర్జున్ తో బోయపాటి శ్రీను సినిమా చేస్తున్నాడనే వార్త బయటకు రాగానే మెగా ఫ్యాన్స్ అనుమానించారు. బన్నీని బోయపాటి మార్చగలడా… లేక బోయపాటి స్టయిల్ లోకి బన్నీ వెళ్లిపోతాడా అనే బెట్టింగ్ లు కూడా నడిచాయి. ఫైనల్ గా మెగాభిమానులు బయపడినట్టే జరిగింది. బన్నీకి నందమూరి సినిమా చూపించాడట బోయపాటి. అంటే మెగా స్టయిల్ లో కాకుండా… బాలకృష్ణతో సినిమాలు చేసిన అనుభవాన్ని సరైనోడు సినిమాలో చూపించాడట. మూవీ మొత్తం బాలయ్య సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతోందట.
దీంతో అల్లు అరవింద్ హుటాహుటిన రీషూట్ ఏర్పాట్లు కూడా చేశాడట. సెన్సార్ కు 10రోజుల ముందు రీషూట్ జరిగిందట. కానీ సినిమా సెకండాఫ్ మాత్రం నందమూరి కాంపౌండ్ నుంచి వచ్చినట్టే ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సరైనోడు సినిమాకు నెగెటివ్ టాక్ నడుస్తోంది. దీనికి తోడు ఇప్పుడు ఇదొక దెబ్బ. ఈ నేపథ్యంలో రేపు విడుదలకానున్న బన్నీ సినిమా ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
First Published:  21 April 2016 5:18 AM GMT
Next Story