Telugu Global
International

మీడియా స్వేచ్ఛ‌లో మ‌నమెక్క‌డో...అడుగున‌!

ప‌త్రికా స్వేచ్ఛ విష‌యంలో మ‌న‌దేశం చాలా వెనుక‌బ‌డి ఉంది. వ‌ర‌ల్డ్ ప్రెస్ ఫ్రీడ‌మ్ ఇండెక్స్ తాజా సాంవ‌త్స‌రిక నివేదిక ప్ర‌కారం,  ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న 180దేశాల్లో మ‌న దేశం 133వ స్థానంలో ఉంది.  ఫిన్‌ల్యాండ్‌లోని రిపోర్ట‌ర్స్ విత‌వుట్ బోర్డ‌ర్స్ అనే సంస్థ ఈ నివేదిక‌ను వెల్ల‌డించింది. మీడియా స్వేచ్ఛ‌లో ఫిన్‌ల్యాండ్ వ‌రుస‌గా ఆరోసారి ప్ర‌థ‌మ‌స్థానంలో ఉంది. దీని త‌రువాత స్థానాల్లో నెద‌ర్లాండ్, నార్వే ఉన్నాయి. 2015లో 136 స్థానంలో ఉన్న భార‌త్ కాస్త మెర‌గ‌యి 133కి చేరింది. జ‌ర్న‌లిస్టులు, […]

మీడియా స్వేచ్ఛ‌లో మ‌నమెక్క‌డో...అడుగున‌!
X

ప‌త్రికా స్వేచ్ఛ విష‌యంలో మ‌న‌దేశం చాలా వెనుక‌బ‌డి ఉంది. వ‌ర‌ల్డ్ ప్రెస్ ఫ్రీడ‌మ్ ఇండెక్స్ తాజా సాంవ‌త్స‌రిక నివేదిక ప్ర‌కారం, ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న 180దేశాల్లో మ‌న దేశం 133వ స్థానంలో ఉంది. ఫిన్‌ల్యాండ్‌లోని రిపోర్ట‌ర్స్ విత‌వుట్ బోర్డ‌ర్స్ అనే సంస్థ ఈ నివేదిక‌ను వెల్ల‌డించింది. మీడియా స్వేచ్ఛ‌లో ఫిన్‌ల్యాండ్ వ‌రుస‌గా ఆరోసారి ప్ర‌థ‌మ‌స్థానంలో ఉంది. దీని త‌రువాత స్థానాల్లో నెద‌ర్లాండ్, నార్వే ఉన్నాయి. 2015లో 136 స్థానంలో ఉన్న భార‌త్ కాస్త మెర‌గ‌యి 133కి చేరింది.

జ‌ర్న‌లిస్టులు, బ్లాగ‌ర్ల భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌కు వివిధ మ‌త సంస్థ‌లు అడ్డు త‌గులుతున్నాయ‌ని, ప్ర‌భుత్వమే సున్నిత ప్రాంతాలుగా పేర్కొన్న క‌శ్మీర్ లాంటి చోట్ల ప‌నిచేయ‌డం జ‌ర్న‌లిస్టుల‌కు క‌త్తిమీద సాములాంటి ప‌ని అని ఈ నివేదిక వెల్ల‌డించింది. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ దీనిపై స‌రిగ్గా స్పందించ‌డం లేద‌ని, జ‌ర్న‌లిస్టుల ర‌క్ష‌ణ‌కు ఎలాంటి యంత్రాంగం లేద‌ని అందులో పేర్కొన్నారు.

మీడియా స్వేచ్ఛ విష‌యంలో పాకిస్తాన్ 147, శ్రీలంక 141, ఆఫ్ఘానిస్తాన్ 120, బంగ్లాదేశ్ 144, నేపాల్ 105, భూటాన్ 94, చైనా 176 స్థానాల్లోనూ, అమెరికా 44, ర‌ష్యా 148 స్థానాల్లోనూ ఉన్నాయి.

First Published:  21 April 2016 5:01 AM GMT
Next Story