విదేశాల్లోలాగా రాజకీయాలు చేస్తాం- లోకేష్

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పుట్టిన రోజు సందర్భంగా నారా లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.  తన తండ్రి వయసు 67 సంవత్సరాలైనా ఇప్పటికీ 16ఏళ్ల యువకుడిలా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. యువతకు తన తండ్రి ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు. లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని చంద్రబాబు ప్రగతిపథంలో నడిపిస్తున్నారని అన్నారు. ఇతర దేశాల్లో ప్రతిపక్షాలు నామమాత్రంగా ఉంటాయని… ఏపీలోనూ అదే పరిస్థితి తీసుకొస్తామన్నారు.

2019నాటికి ఏపీలో ప్రతిపక్షాన్ని నామమాత్రంగా చేస్తామన్నారు.  చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాల్లో మాదిరిగా ప్రతిపక్షం లేకుండా చేస్తామంటున్నారు కానీ అక్కడికి ఇక్కడికి రాజకీయంగా, సామాజికంగా, ప్రజల ఆలోచన ధోరణిలో ఎంతో మార్పు ఉంది. ఆ విషయాన్ని కూడా లోకేష్ బాబు గుర్తించి ప్రజల కోసం పనిచేస్తే ఆటోమెటిక్‌గా జనమే మరోసారి పట్టం కడుతారు. అంతేతప్పితే ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకుని రాజకీయంగా బలపడుదామన్న ఫార్ములా విజయం సాధించినట్టు మన దేశంలో ఎక్కడా లేదు.

Click on Image to Read:

women-proprty

speaker-madhusudhana-chary

naresh-kumar-reddy

jagan

chevireddy-bonda-uma

ponguleti

MP-Mallareddy

Gali-Muddu-Krishnama-Naidu

nellore-leader

pub-disco

ysjagan-cbi-case

acp

babu-birthday

sakshi

roja-bonda1