జగన్ ఆస్తుల కేసులో మరో నలుగురికి ఊరట

జగన్ ఆస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న వారికి వరుసగా ఊరట లభిస్తోంది. జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించి హెటిరో కంపెనీ, ఆ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డిలపై సీబీఐ కోర్టులో జరుగుతున్న విచారణను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పెట్టుబడుల నిర్ణయాన్ని కంపెనీ డైరెక్టర్‌గా తీసుకున్నారే తప్పా వ్యక్తిగతంగా కాదని శ్రీనివాస్ రెడ్డి తరపున న్యాయవాది వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి సీబీఐ కోర్టులో శ్రీనివాస్‌ రెడ్డిపై జరుగుతున్న విచారణను నిలిపివేశారు.

జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో అరబిందో, హెటిరో, ట్రైడెంట్ లైఫ్ సైస్సెస్‌ సంస్థలకు భూముల కేటాయింపులో సీబీఐ నిందితుడిగా చేర్చిన ఐఏఎస్ అధికారి బీపీ అచార్యపై విచారణను కూడా హైకోర్టు నిలిపివేస్తూ  బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఇందూ గృహ నిర్మాణ మండలి భూ కేటాయింపు కేసులో నిందితుడిగా ఉన్న ఎంబసీ రియల్టర్ జితేంద్ర వీర్వాణికి వ్యక్తిగత హాజరు నుంచి హైకోర్టు మినహాయింపు ఇచ్చింది.

జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలోనే ట్రైడెండ్ లైఫ్ సైన్సెస్ ఎండీ శరత్‌ చంద్రారెడ్డికీ ఊరట లభించింది. వ్యక్తిగత హాజరు నుంచి ఆయనకు హైకోర్టు మినహాయింపు ఇచ్చింది.

Click on Image to Read:

chevireddy-bonda-uma

ponguleti

MP-Mallareddy

Gali-Muddu-Krishnama-Naidu

nellore-leader

pub-disco

ysjagan-cbi-case

acp

babu-birthday

sakshi

roja-bonda1